ETV Bharat / bharat

విజయం వాయిదా... నిలిచిన చంద్రయాన్​-2 - లోపం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన..జాబిల్లి యాత్ర...... చంద్రయాన్‌-2 అనూహ్యంగా ఆగిపోయింది. వాహక నౌక జీఎస్​ఎల్వీ మార్క్‌3లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

సాంకేతిక లోపంతో చంద్రయాన్​-2 నిలిపివేత
author img

By

Published : Jul 15, 2019, 2:59 AM IST

Updated : Jul 15, 2019, 9:25 AM IST

నిలిచిన చంద్రయాన్​-2- విజయం వాయిదా

చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి జులై 20కి 50 ఏళ్లు పూర్తవుతున్న వేళ మరోసారి చంద్రమండల యాత్ర చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో సాంకేతిక సమస్యతో చంద్రయాన్​-2 ప్రయోగాన్ని నిలిపివేసింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్లు ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత 2, 3 నిమిషాలకే చంద్రయాన్‌-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేశారు.

వాహకనౌకలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం నిలిపివేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. మళ్లీ ఆ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు చెప్పారు.

"ప్రయోగానికి 56 నిమిషాల ముందు...వాహకనౌక వ్యవస్థలో సాంకేతికపరమైన సమస్య గుర్తించాం. ముందుజాగ్రత్త చర్యగా చంద్రయాన్‌2 ప్రయోగాన్ని ఇవాళ నిలిపివేశాం.
తదుపరి ప్రయోగ తేదీని తర్వాత ప్రకటిస్తాం". - బి.ఆర్‌.గురుప్రసాద్‌, ఇస్రో అసోసియేట్‌ డైరెక్టర్‌

మళ్లీ ఎప్పుడు..?

అన్నీ అనుకున్నట్లు సాగి ఉంటే ఈ తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు శ్రీహరికోట-షార్‌నుంచి జీఎస్​ఎల్వీ మార్క్‌3 ఎమ్​1 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండేది. ఆపై కేవలం 16 నిమిషాల 13 సెకన్ల వ్యవధిలోనే చంద్రయాన్‌-2 నిర్ణిత కక్ష్యలో ప్రవేశపెట్టి ఉండేది.

సాంకేతికపరమైన సమస్య కారణంగా ప్రయోగం నిలిచిపోగా., తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ ప్రయోగాన్ని జనవరి మొదటివారంలోనే చేపట్టాలని నిర్ణయించినప్పటికీ జులై 15కు వాయిదా పడింది. సాధారణంగా నిర్దిష్ట సమయంలోనే వ్యోమనౌకను ప్రయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ప్రయోగించలేకపోతే మళ్లీ అనువైన సమయం వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.

ప్రస్తుత లాంచ్ విండోతో ప్రయోగాన్ని పూర్తి చేసేందుకు.. ఇస్రో తీవ్రంగా శ్రమించినప్పటికీ నిరాశే ఎదురైంది. మళ్లీ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు అనువుగా ఈ నెలలో కేవలం 1 నిమిషం నిడివి ఉన్న లాంచ్‌ విండోలే అందుబాటులో ఉన్నాయి. ఇవాల్టి లాంచ్‌ విండో నిడివి 10 నిమిషాలు కావటం గమనార్హాం.

రాష్ట్రపతి తిరుగు ప్రయాణం...

చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని స్వయంగా వీక్షించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గత రాత్రే సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి చేరుకున్నారు. ప్రయోగం నిలిచిపోవడం వల్ల ఆయన ఈ ఉదయం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు.

Dantewada (Chhattisgarh), July 14 (ANI): Two Naxals were killed in an encounter with the paramilitary forces in Chhattisgarh's Dantewada on Saturday. Bodies were recovered along with the weapon. One Naxal has been arrested.
Last Updated : Jul 15, 2019, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.