పౌరసత్వ చట్ట సవరణను నిరసిస్తూ మరోసారి రోడ్డెక్కారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కోల్‌కతా జాదవ్‌పుర్ నుంచి జాదు బాబూస్ బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిన్న కూడా కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు మమత.
లోక్‌సభలో సంఖ్యా బలం ఉందని చట్టాలను చేసి.. వాటిని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దాలని భాజపా చూస్తోందని మమత విమర్శించారు. ఒకటి రెండు చిన్న ఘర్షణలను సాకుగా చూపి బంగాల్‌కు కేంద్రం రైలు సేవలు నిలిపివేసిందని మండిపడ్డారు.
"బంగాల్‌లో జరిగిన చిన్న చిన్న ఘర్షణ వల్ల రాష్ట్రానికి కేంద్రం రైల్వే సేవలను నిలిపివేసింది. రైల్వే ఆస్తులను రక్షించడం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది విధి. వారికి కావాల్సిన మద్దతును మా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటివరకు 600 మంది నిరసనకారులను అరెస్టు చేశాము. రైళ్లను పునరుద్ధరించాలని కోరుతున్నాను."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
జామియా మిలియా విద్యార్థులపై జరిగిన దాడి క్రూరమైనదిగా మమత అభివర్ణించారు.
ఇదీ చూడండి : 'కేదార్నాథ్'ను ముంచెత్తిన మంచు