ETV Bharat / bharat

ఇకపై మూడు విభాగాలుగా కరోనా ఆసుపత్రులు

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా అసుపత్రులను మూడు విభాగాలుగా వర్గీకరించాలని స్పష్టం చేసింది. ఇవి కొవిడ్‌ సంరక్షణ కేంద్రం, కొవిడ్‌ ఆరోగ్య కేంద్రం, కొవిడ్‌ ఆసుపత్రిగా ఉండాలని సూచించింది.

centre-directs-all-states-to-divide-corona-hospitals-into-three
ఇకపై మూడు విభాగాలుగా కరోనా ఆసుపత్రులు
author img

By

Published : Apr 8, 2020, 8:45 AM IST

కరోనా ఆసుపత్రులను మూడు విభాగాలుగా వర్గీకరించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీచేసింది. కొవిడ్‌ సంరక్షణ కేంద్రం, కొవిడ్‌ ఆరోగ్య కేంద్రం, కొవిడ్‌ ఆసుపత్రి పేరుతో వీటిని వర్గీకరించాలని సూచించింది. రోగ తీవ్రత తక్కువ, మధ్యస్థాయి, ఎక్కువస్థాయిలో ఉన్న రోగులను వీటి మధ్య విభజించాలని స్పష్టంచేసింది.

  • సంరక్షణ కేంద్రం

తక్కువ (మైల్డ్‌), అతి తక్కువ (వెరీ మైల్డ్‌), అనుమానిత కేసులను ఇక్కడ పెట్టాలి. ఇది తాత్కాలికం కావచ్చు. వసతిగృహాలు, హోటళ్లు, పాఠశాలలు, స్టేడియంలు, లాడ్జ్‌లు, ధర్మశాలల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. క్వారంటైన్‌ కేంద్రాలను కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలుగానూ మార్చుకోవచ్చు. ఈ కేంద్రాన్ని ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రంతో మ్యాపింగ్‌ చేయాలి. ఇక్కడున్న రోగులకు తదుపరి వైద్యసేవలు అవసరమైతే అందుకు అవసరమైన ప్రణాళిక తయారుచేసి సిద్ధంగా ఉంచుకోవాలి.

  • ఆరోగ్య కేంద్రం

ఇందులో రోగ తీవ్రత కొంత ఎక్కువ (మోడరేట్‌) ఉన్న వారిని ఉంచాలి. పూర్తి ఆసుపత్రిని లేదా ఆసుపత్రిలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయించాలి. ఆక్సిజన్‌తో కూడిన పడకలు ఉండాలి.

  • ఆసుపత్రులు

లక్షణాల తీవ్రత, ప్రమాదం ఎక్కువగా ఉన్న రోగులకు ఇక్కడ చికిత్స అందించాలి. ఆసుపత్రులు లేదంటే బ్లాక్‌లను ఇందుకు కేటాయించాలి. వీటిలో ఐసీయూ సౌకర్యం, వెంటిలేటర్లు ఉండాలి.

ఇదీ చూడండి:- కరోనా కట్టడికి కేజ్రీవాల్‌ పాంచజన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.