కొవిడ్ రోగులు ఆస్పత్రుల్లో ఉన్న సమయంలో తమ కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు స్మార్ట్‌ఫోన్లు అనుమతించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. తద్వారా వారికి మనోధైర్యం చేకూర్చాలంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ గార్గ్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ కార్యదర్శలకు లేఖలు రాశారు.
స్మార్ట్ ఫోన్లు వాడేందుకు అనుమతిస్తే వార్డుల్లో, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఇంటి దగ్గర ఉన్న కుటుంబ సభ్యలు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు గార్గ్. కొవిడ్ రోగులు ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాల్ని క్రిమిరహితం చేయాలని.. ఇంట్లో వాళ్లతో మాట్లాడేందుకు ఓ సమయాన్ని నిర్దేశించాలని సూచించారు.
కొన్ని రాష్ట్రాలు కొవిడ్ వార్డుల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించకపోవటం వల్ల.. కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు వీలు లేకుండాపోయిందని.. ఆ పరిస్థితి వద్దని గార్గ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా వైరస్ను న్యూట్రలైజ్ చేసే పరికరం