ETV Bharat / bharat

అన్​లాక్​-4: 7 నుంచి మెట్రో కూత- థియేటర్లకు నో - అన్​లాక్​-4

సెప్టెంబర్​ 1 నుంచి అమలుకానున్న అన్​లాక్​-4 మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. 7 నుంచి మెట్రో రైళ్లు నడిపించుకునేందుకు అనుమతినిచ్చింది. దశల వారీగా మెట్రో కార్యకలాపాలను పునరుద్ధరించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. 21 నుంచి.. 100 మందికి మించకుండా సామాజిక/ విద్య/ వినోద/ సాంస్కృతిక/ మత/ రాజకీయపరమైన సమావేశాలు నిర్వహించుకోవడానికి పచ్చజెండా ఊపింది.

Center releases guidelines for unlock-4, metro to run from September 7th.
అన్​లాక్​-4: 7 నుంచి మెట్రో కూత- థియేటర్లకు నో
author img

By

Published : Aug 30, 2020, 5:09 AM IST

సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రో రైళ్లు నడిపించుకునేందుకు కేంద్రం అనుమతించింది. పట్టణాభివృద్ధి, రైల్వే శాఖలు కేంద్ర హోం శాఖతో సంప్రదించి దశలవారీగా మెట్రో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని సూచించింది. 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు ప్రారంభించుకోవచ్చు. అదేరోజు నుంచి 100 మందికి మించకుండా సామాజిక/ విద్య/ వినోద/ సాంస్కృతిక/ మత/ రాజకీయపరమైన సమావేశాలు నిర్వహించుకోవడానికి పచ్చజెండా ఊపింది. శనివారం ఈ మేరకు అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లను మూసేయాలని ఆదేశించింది.

9 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నవారు తమ ఉపాధ్యాయుల సలహాల కోసం తల్లిదండ్రుల ముందస్తు అనుమతితో స్వచ్ఛందంగా స్కూళ్లను సందర్శించడానికి వెసులుబాటు కల్పించింది. ఎప్పటిలాగానే ఆన్‌లైన్‌ తరగతులు స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అన్‌లాక్‌-3 నిబంధనల గడువు ఈ నెల 31తో ముగిసిపోతుండటంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా తాజా ఉత్తర్వులు విడుదల చేశారు.

21 నుంచి అనుమతించే కార్యకలాపాలు

పాఠశాలల మూసివేత ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ బోధన, టెలి కౌన్సిలింగ్‌, ఇతరత్రా కార్యకలాపాల కోసం 50% బోధన, బోధనేతర సిబ్బందిని రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. ప్రామాణిక వైద్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

  • జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలు, ఐటీఐలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ శాఖల వద్ద నమోదైన స్వల్పకాల శిక్షణ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించుకోవచ్చు. చిన్న వ్యాపారాల అభివృద్ధికి, వ్యాపారాపేక్షను ప్రోత్సహించడానికి ఏర్పాటైన జాతీయ సంస్థలు శిక్షణ కార్యకలాపాలు మొదలుపెట్టుకోవచ్చు.
  • పీహెచ్‌డీ విద్యార్థులు, ప్రయోగశాలల్లో పనులు అవసరమైన సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులు చేస్తున్న పీజీ విద్యార్థుల కోసమే 21 నుంచి ఉన్నత విద్యాసంస్థలు తెరుస్తారు. కేంద్ర హోంశాఖతో సంప్రదించిన తర్వాత, కొవిడ్‌ పరిస్థితులను అంచనా వేసి, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల్ని గమనించాకే కేంద్ర ఉన్నత విద్యాశాఖ దీనికి అనుమతిస్తుంది.
  • పరిమిత సంఖ్యలో సభలకు అనుమతించినా వాటికి హాజరయ్యేవారు భౌతిక దూరం సహా అన్ని నిబంధనల్ని పాటించాలి.
  • సెప్టెంబర్‌ 20 వరకు వివాహ కార్యకలాపాల్లో గరిష్ఠంగా 50 మంది, అంత్యక్రియల నిర్వహణలో 20 మంది మాత్రమే పాల్గొనాలి. 21వ తేదీ నుంచి వీటిలో 100 మంది వరకు పాల్గొనవచ్చు.

కంటెయిన్‌మెంట్‌ జోన్లలో 30 వరకు లాక్‌డౌన్‌

అన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలుచేయాలి. అత్యవసర కార్యకలాపాలు మినహాయించి మిగిలిన వాటిని అక్కడ అనుమతించకూడదు.

  • జిల్లాల్లోని కంటెయిన్‌మెంట్‌ జోన్లు, వాటి పరిధులను రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లలో పొందుపరచడంతోపాటు వాటి వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు పంపాలి.
  • కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట ఎలాంటి స్థానిక లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించకూడదు.

రవాణాపై ఎలాంటి పరిమితులు లేవు

రాష్ట్రాల లోపల, వేర్వేరు రాష్ట్రాల మధ్య రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. ప్రయాణికులు, సరకుల రవాణాపై పరిమితులు అమలు చేయకూడదు. వీటికి ప్రత్యేక అనుమతులు, ఈ-పర్మిట్లు అవసరం లేదు.

  • భౌతిక దూరం కోసం కొవిడ్‌-19 జాతీయ నిర్దేశాలను దేశం మొత్తం పాటించాల్సిందే. దుకాణాల్లో వినియోగదారుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ నిర్దేశాలు సరిగా అమలవుతున్నాయా? లేదా? అన్నది హోంశాఖ పర్యవేక్షిస్తుంది.
  • రైళ్లు, దేశీయ విమాన ప్రయాణాలు, వందేభారత్‌ విమానాలు, నౌకల రాకపోకలను ఇప్పటికే జారీచేసిన ప్రామాణిక నిబంధనల ప్రకారం నియంత్రిస్తారు.
  • 65 ఏళ్ల పైబడిన వారు, ఆరోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు ఇళ్లలోనే ఉండటం శ్రేయస్కరం.
  • ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్టం-2005 కింద జారీచేసిన ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు నీరుకార్చకూడదు.
  • భౌతిక దూరం అమలు చేయడానికి 144 సెక్షన్‌ విధించుకోవచ్చు.

వీటిపై నిషేధం

  • సినిమా హాళ్లు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు (ఓపెన్‌ ఎయిర్‌ మినహాయించి) వంటివి
  • అంతర్జాతీయ విమాన ప్రయాణాలు (కేంద్ర హోంశాఖ అనుమతించినవి మినహా)
  • కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట పైన పేర్కొన్న కార్యకలాపాలు మినహా మిగిలినవన్నీ కొనసాగించుకోవచ్చు.

ఇదీ చూడండి:- కరోనాను జయించిన 110 ఏళ్ల బామ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.