ETV Bharat / bharat

అత్యవసర వినియోగానికి.. కొవాగ్జిన్‌కూ అనుమతి!

కరోనా వైరస్​ను అరికట్టేందుకు దేశీయంగా రూపొందించిన 'కొవాగ్జిన్​' వ్యాక్సిన్​కు నిపుణుల కమిటీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. అయితే.. కొవాగ్జిన్‌పై మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలను కొనసాగించాలని భారత్‌ బయోటెక్‌కు నిపుణుల బృందం సూచించింది. ఆ డేటాను ఎప్పటికప్పుడు సమర్పించాలని నిర్దేశించింది.

CDSCO PANEL RECOMMENDED FOR RESTRICTED EMERGENCY USE OF COVAXIN VACCINE
కొవాగ్జిన్‌కూ అనుమతి!
author img

By

Published : Jan 3, 2021, 5:03 AM IST

కొవిడ్‌-19 నిర్మూలనకు రూపొందిన భారత తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. కరోనా వైరస్‌ రూపాంతరం చెంది, కొత్త రకాలు విజృంభిస్తున్న తరుణంలో ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. క్లినికల్‌ ట్రయల్‌ విధానంలో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని సూచించింది. కొవాగ్జిన్‌కు డీసీజీఐ తుది అనుమతి రావడమే మిగిలి ఉంది. అది లాంఛనప్రాయమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టీకా ఉత్పత్తి, పంపిణీ అంశాలపై భారత్‌ బయోటెక్‌ దృష్టి సారించనుంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)లోని నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశమై కొవిడ్‌-19 టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే అంశంపై చర్చించింది.

యథావిథిగానే మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతిని సిఫార్సు చేయాలని ఇప్పటికే సూచించింది సీడీఎస్​సీఓ. శనివారం మరోసారి సమావేశమైన నిపుణుల కమిటీ.. భారత్‌ బయోటెక్‌ దరఖాస్తును, ఆ సంస్థ సమర్పించిన అదనపు డేటా, వాస్తవాలు, విశ్లేషణ వివరాలను పరిశీలించింది. కరోనా వైరస్‌లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రజాప్రయోజనాల మేరకు అత్యవసర పరిస్థితుల్లో ముందుజాగ్రత్తగా క్లినికల్‌ ప్రయోగాల విధానంలో ఉపయోగించడానికి అనుమతినివ్వాలని డీసీజీఐకి సిఫార్సు చేసింది. అయితే.. కొవాగ్జిన్‌పై మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలను కొనసాగించాలని భారత్‌ బయోటెక్‌కు నిపుణుల కమిటీ సూచించింది. ఆ డేటాను ఎప్పటికప్పుడు సమర్పించాలని నిర్దేశించింది.

అమెరికాకు చెందిన ఫైజర్‌ సంస్థ కూడా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ పరిశీలన చేపట్టలేదు. క్యాడిలా హెల్త్‌కేర్‌ అభివృద్ధి చేస్తున్న మరో టీకాకు మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకు అనుమతినివ్వాలని సూచించింది.కమిటీ తాజా నిర్ణయంతో కొద్ది రోజుల్లో రెండు టీకాల విడుదలకు మార్గం సుగమమవుతుంది. మరో రెండు టీకాల అభివృద్ధి తుది దశలో ఉంది.

టీకాను ఎలా అభివృద్ధి చేశారంటే?

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ అందించిన సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ స్ట్రెయిన్‌తో భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్‌.. ఇన్‌యాక్టివేటెడ్‌ రకానికి చెందిన టీకా. వ్యాధికారక సూక్ష్మజీవిని నిర్వీర్యం చేయడం ద్వారా వీటిని తయారుచేస్తారు. ఫలితంగా ఈ జీవికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. అయితే టీకా తీసుకున్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ గుర్తించగలిగి, వాటిపై ప్రతిస్పందన చర్యలను కలిగించే స్థాయిలో అది ఉంటుంది. హెపటైటిస్‌-ఎ, ఇన్‌ఫ్లూయెంజా, పోలియో, రేబీస్‌ వంటి అనేక వ్యాధులకు ఇన్‌యాక్టివేటెడ్‌ టీకాలనే ఇస్తున్నారు.

అన్ని పరీక్షలు పూర్తయ్యాయా?

మొదటి, రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 26వేల మందిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను భారత్‌ బయోటెక్‌ చేపట్టింది. 23వేల మంది వాలంటీర్ల ఎంపికను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల్లో ఈ టీకా ఎంతో సురక్షితమైనదిగా తేలింది. 65 శాతానికి పైగా సమర్థతను కనబరచింది. మూడో దశ పరీక్షల్లో సమర్థత ఇంకా పెరుగుతుందని కంపెనీ గతంలో వెల్లడించింది. ఈ టీకాను అన్ని వర్గాల వారూ తట్టుకోగలిగారు. ఎవరిలోనూ తీవ్ర దుష్ప్రభావాలు కలగలేదు.

కొవాగ్జిన్‌ తయారీ ఎప్పుడు? ఎన్ని డోసులు?

కొవాగ్జిన్‌ తయారీని ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ చేపట్టింది. కోటి డోసులు ఉత్పత్తయ్యాయి. తుది అనుమతి రాగానే వీటిని పంపిణీ చేస్తారు. కంపెనీకి ఏటా 30 కోట్ల డోసుల టీకా తయారీ సామర్థ్యం ఉంది. అవసరాన్ని బట్టి అదనపు సామర్థ్యాన్ని సమకూర్చుకోవటానికీ కంపెనీ సిద్ధంగా ఉంది.ఇంజెక్షన్‌ ద్వారా ఈ టీకాను ఇస్తారు. తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాలి. మొదటి డోసు ఇచ్చిన 28 రోజులకు రెండో డోసు ఇస్తారు.

ఎక్కడ తయారు చేస్తారు?

కొవాగ్జిన్‌ను హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌కు చెందిన యూనిట్లోని బీఎస్‌ఎల్‌(బయో సేఫ్టీ లెవల్‌)- 3 సదుపాయంలో తయారుచేస్తారు. ఇటువంటి అత్యంత భద్రమైన తయారీ యూనిట్‌ భారత్‌ బయోటెక్‌కు మాత్రమే ఉంది. చైనా, అమెరికాలోని కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే బీఎస్‌ఎల్‌-3 తయారీ యూనిట్లు నిర్మించుకుంటున్నాయి.

కొత్త రకాలపైనా పనిచేస్తుందా?

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్తరకం కరోనా వైరస్‌లపైనా కొవాగ్జిన్‌ చక్కగా పనిచేస్తుందని ఇటు కంపెనీ వర్గాలు, అటు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

ఇదీ చదవండి: టీకా వినియోగంపై ఆదివారం కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.