ETV Bharat / bharat

కోల్​కతా మాజీ సీపీ రాజీవ్​కు సీబీఐ నోటీసులు - సుప్రీంకోర్టు

శారదా కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న కోల్​కతా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్​కుమార్​కు తాజాగా సీబీఐ నోటీసులు జారీచేసింది. సోమవారం తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.

కోల్​కతా మాజీ సీపీ రాజీవ్​కు సీబీఐ నోటీసులు
author img

By

Published : May 26, 2019, 9:52 PM IST

Updated : May 26, 2019, 11:39 PM IST

కోల్​కతా మాజీ సీపీ రాజీవ్​కు సీబీఐ నోటీసులు

శారదా కుంభకోణం విచారణ కేసులో కోల్​కతా మాజీ పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ రోజు రాజీవ్​కుమార్​పై లుక్​అవుట్​ నోటీసులిచ్చిన సీబీఐ తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది. సోమవారం కోల్​కతాలోని సీబీఐ కార్యాలయం ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

శారదా కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించమని రాజీవ్ చేసిన​ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన ఒక్కరోజులోనే ఈ నోటీసులు జారీకావడం గమనార్హం.

లుక్అవుట్​ నోటీసు..

ఇవాళ ఉదయం లుక్​అవుట్​ నోటీసు జారీచేసిన సీబీఐ...రాజీవ్​కుమార్​ దేశం విడిచి పారిపోకుండా విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్ద భద్రత పటిష్ఠం చేసింది. రాజీవ్​కుమార్​ విచారణకు సహకరించడం లేదని, అతణ్ని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతామని సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. సరిపడా ఆధారాలు సమర్పిస్తే పరిశీలిస్తామని సీబీఐకి సూచించింది అత్యున్నత న్యాయస్థానం.

శారదా (పోంజీ) కుంభకోణం కేసు విషయంలో గతంలో రాజీవ్​కుమార్​కు అరెస్టు నుంచి ఊరట కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. దానిని పొడిగించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే రాజీవ్​కుమార్​ విజ్ఞప్తిని శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఇదీ చూడండి: మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఫోన్​

Ludhiana, May 26 (ANI): Punjab police arrested two persons in Firozpur on Saturday and confiscated over 3.5 kilograms of heroin from their possession.According to police, Special Task Force (STF), Ludhiana arrested the duo near Border Security Force (BSF) post, Ghatti Hayat in Firozpur and seized 3.560 kilograms of the heroin and a motorbike, recovered from the accused.The two were identified as Boota Singh and Harchand Singh, both residents of Tarn Taran district.Accused Boota Singh has as many as 10 cases under the Narcotic Drugs and Psychotropic Substances (NDPS) Act against him.
Last Updated : May 26, 2019, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.