ETV Bharat / bharat

నవంబర్​ వరకు ఉచిత రేషన్​- కేబినెట్ ఆమోదం

కరోనా నేపథ్యంలో కష్టాల్లో ఉన్న పేదలకు ఉచిత రేషన్​ అందజేసే కార్యక్రమాన్ని నవంబరు వరకు పొడిగించింది కేంద్రం. రూ.15వేల లోపు వేతనం ఉన్న ఉద్యోగుల ఈపీఎఫ్​ భారాన్ని మరో 3 నెలల పాటు కేంద్రమే మోయనుంది. ఈ నిర్ణయాలకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.

Cabinet approves distribution of free foodgrain till Nov
పేదలకు ఉచిత రేషన్​ నవంబర్​ వరకు పొడిగింపు
author img

By

Published : Jul 8, 2020, 4:34 PM IST

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్​​ అన్న యోజన కింద దేశంలోని పేదలందరికీ మరో 5 నెలలు ఉచితంగా రేషన్​ అందించేందుకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. లక్షా 49వేల కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తెలిపారు. 81కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

దేశంలోని 7.4 కోట్ల మంది పేద మహిళలకు మరో 3నెలల పాటు ఉచిత ఎల్​పీజీ సిలిండర్లు అందించేందుకు, ఉద్యోగుల ఈపీఎఫ్​ భారాన్ని(ఉద్యోగి వాటా12శాతం+ యజమాని వాటా 12శాతం) మరో 3 నెలల పాటు కేంద్రమే భరించేందుకు కేబినెట్​ ఆమోదం తెలిపినట్లు జావడేకర్ వెల్లడించారు.

ఉచిత ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్ల ద్వారా 7.4 కోట్ల మంది పేద మహిళలు, ఈపీఎఫ్ ద్వారా 72లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని జావడేకర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ట్రస్ట్' పాలిటిక్స్​: చట్ట ఉల్లంఘనా? కక్షసాధింపా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.