జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఘటనకు సంబంధించి కేంద్రం, దిల్లీ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. విశ్వవిద్యాలయంలో జరిగిన హింసాత్మక ఘటనలపై నిజ నిర్ధరణ కమిటీని వేయాలని దాఖలైన పిటిషన్పై ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.
అయితే విద్యార్థులకు అరెస్టు, చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది కోర్టు. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. ఈ విషయంపై న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ జరిగింది..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన నిరసనల్లో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో పలు ప్రభుత్వ బస్సులు, రెండు పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. పలువురు విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు.
ఇదీ చూడండి: దిల్లీ 'జామియా' ఘటనలో 10 మంది అరెస్టు