ETV Bharat / bharat

'పొరుగు దేశాల వ్యూహాలను తిప్పికొట్టాలి'

భారత రక్షణలో బీఎస్ఎఫ్ పాత్ర మరింత కీలకమైందన్నారు బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ అస్థానా. భారత్​పై దాడికి పొరుగు దేశాలు రచిస్తున్న వ్యూహాలను తిప్పికొట్టేందుకు సర్వదా సిద్ధంగా ఉండాలన్నారు.

author img

By

Published : Sep 7, 2020, 11:21 AM IST

BSF's role more important as two neighbouring countries planning against India: DG Rakesh Asthana
'పొరుగు దేశాల వ్యూహాలను తిప్పికొట్టాలి!'

దేశ రక్షణలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్​) పాత్ర అత్యంత కీలకమన్నారు బీఎస్ఎఫ్ చీఫ్​ రాకేశ్​ అస్థానా. జమ్ముకశ్మీర్, రాజౌరి, పూంఛ్ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్ డిఫెన్స్ లొకేషన్స్ (ఎఫ్‌డీఎల్)లో మూడు రోజుల పాటు పర్యటించారు అస్థానా. ఆగస్టులో సాంబా ప్రాంతంలో బయటపడిన ఓ అక్రమ, రహస్య సొరంగం ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు. ఆపై పలౌరా క్యాంప్ 'సైనిక్ సమ్మేళనం'లో ప్రసంగించారు.

"మన పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే భారత రక్షణ విభాగంలో మనమే ముందు వరుసలో ఉన్నాం. రెండు పొరుగు దేశాలు మనపై కుట్రకు వ్యూహాలు రచిస్తున్నాయి."

- రాకేశ్​ అస్థానా, బీఎస్ఎఫ్ చీఫ్

భారత్​- చైనా సరిహద్దులో ఉద్ధ్రిక్త పరిస్థితులు.. పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ దుశ్చర్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, చైనా, పాకిస్థాన్ దేశాల పేర్లు ప్రస్తావించకుండా పొరుగు దేశాల వ్యూహాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు అస్థానా. దేశ రక్షణలో బీఎస్ఎఫ్ జవాన్ల తెగింపు ఎప్పటికీ ప్రశంసనీయమేనన్నారు.

ఇదీ చదవండి: సరిహద్దులో శరవేగంగా రోడ్ల నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.