ఉత్తర్ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. యమునా ఎక్స్ప్రెస్వే పై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వస్తున్న ఓ కంటైనర్ను ఓ వాహనం ఢీకొట్టింది. అనంతరం ఆ కారులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే వాహనంలోని ఐదుగురు సజీవనం దహనానికి గురయ్యారు.
ఆ సమయంలో వాహనంలోని వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. సహాయం కోసం వారు అరుస్తూనే ఉన్నారు.
ఈ ఘటన జరిగిన గంటసేపటికి.. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కంటైనర్ నాగాలాండ్ నుంచి వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.