ETV Bharat / bharat

భారత్​లో బ్రెజిల్​ అధ్యక్షుడు.. నేడు ప్రధాని మోదీతో భేటీ - NATIONAL NEWS

బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్​​ మెసియస్​ బోల్సొనారో నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో చమురు, మైనింగ్ సహా పలు రంగాలకు ఊతమందించేలా 15 కీలక ఒప్పందాలపై ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు.

Brazilian Prez Bolsonaro arrives in India;  both sides to ink 15 pacts on Saturday
భారత్​లో బ్రెజిల్​ అధ్యక్షుడు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
author img

By

Published : Jan 25, 2020, 5:44 AM IST

Updated : Feb 18, 2020, 7:59 AM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్​ అధ్యక్షుడు జాయిర్​​ మెసియస్​ బోల్సొనారో నేడు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చమురు, గ్యాస్​, మైనింగ్​, సైబర్​ భద్రత వంటి రంగాల్లో ఇరుదేశాల సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ భేటీలో 15 కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది.

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారమే భారత్​ చేరుకున్నారు బ్రెజిల్‌ అధ్యక్షుడు. కూతురు లారా బోల్సొనారో, కోడలు లెటీసియా ఫిర్మీతో పాటు ఎనిమిది మంది మంత్రుల బృందంతో భారత్​కు విచ్చేసిన జాయిర్‌ బోల్సొనారో.. జనవరి 26న నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాని మోదీ బ్రెజిల్‌ పర్యటనలో ఉన్నప్పుడే ఆయనను ఆహ్వానించారు. భారత్​లో అడుగు పెట్టిన వెంటనే తన బృందంతో కలిసి దిల్లీలోని అక్షర్​ధామ్​ ఆలయాన్ని సందర్శించారు బోల్సొనారో.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: టీఎంసీ-2 చిత్రించిన బిలం 3డీ వ్యూ

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/pm-modi-shares-pictures-with-recipients-of-rashtriya-bal-puraskar-on-social-media20200124220033/

Conclusion:
Last Updated : Feb 18, 2020, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.