ETV Bharat / bharat

ఆ గ్రామాల్లో యువకులందరూ పెళ్లికాని ప్రసాదులే..!

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయి దొరకకపోవటం, ఇతరత్రా కారణాలతో వివాహం కాలేదంటే అతణ్ని అందరు హేళనగా చూస్తారు. మరి ఊరు ఊరంతా పెళ్లికాని ప్రసాదులే ఉంటే.. వారి పరిస్థితి ఏంటి? అలాంటి ఊళ్లూ ఉన్నాయి. అది ఎక్కడో కాదు ఉత్తర్​ప్రదేశ్​లోనే..  మరి అలా ఎందుకు జరుగుతోంది. కారణాలేంటో తెలుసుకుందాం.

ఆ గ్రామాల్లో యువకులందరూ పెళ్లికాని ప్రసాదులే..!
author img

By

Published : Oct 13, 2019, 11:54 AM IST

Updated : Oct 13, 2019, 2:42 PM IST

ఆ గ్రామాల్లో యువకులందరూ పెళ్లికాని ప్రసాదులే..!

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​ జిల్లాలోని దిల్లీ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 4 గ్రామాల్లో యువకులకు వివాహాలు జరగటం లేదు. అవును మీరు విన్నది నిజమే. దాని వెనకాల కారణం వింటే మీరు ఆశ్చర్యపోతారు. అవి బదువాపుర్​, పన్కీ పడ్వా, జముయీ, సరయమిత్ర గ్రామాలు. ఈ ఊళ్లలో పెళ్లి కాని యువకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

ఇందుకు గల కారణం ఈ ఊర్లకు సమీపంలో కాన్పుర్​ పురపాలక సంఘానికి చెందిన డంపింగ్​ యార్డు ఉండటమే. ఈ చెత్త నుంచి వస్తోన్న దుర్గంధం వల్ల నాలుగు ఊళ్లల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జబ్బుల బారిన పడుతున్నారు. ఈ గ్రామాల్లోని యువకులకు అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు.

ఒక్క నిమిషం కూడా..

ఇతర గ్రామాల్లోని బంధువులు తమ కూతుళ్లను ఇక్కడి యువకులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా.. ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు మార్చుకుంటున్నారని వాపోతున్నారు ఆయా గ్రామస్థులు. డంపిగ్​ యార్డు నుంచి వెలువడే దుర్గంధం, ప్రజలు జబ్బుల బారిన పడుతున్న విషయాలను గమనించి బంధుత్వాలనూ తెంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది పెళ్లిళ్లు నిశ్చయించుకున్నా.. తర్వాత మానుకుంటున్నారని చెబుతున్నారు.

"ఏ ఇంటిలోనైనా పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఇతర గ్రామాలకు చెందిన వారు వారి అమ్మాయిని ఇచ్చేందుకు ఇక్కడకు వచ్చి గ్రామంలోని పరిస్థితిని చూసి ఒక్క నిమిషం కూడా ఉండటం లేదు. ఇక్కడి దుర్గంధాన్ని చూసి తిరిగి వెళ్లిపోతున్నారు. నా అంచనా ప్రకారం గ్రామంలో సుమారు 100 మంది యువకులు ఉన్నారు. అందులో సుమారు 70 మంది వరకు పెళ్లి కావడం లేదు."

- గ్రామస్థుడు, బదువాపుర్

డంపింగ్​ యార్డు విషయంపై పురపాలక సంఘం కమిషనర్​ సంతోష్​ శర్మను సంప్రదించగా.. సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అక్కడ చెత్త వేస్తున్న మాట నిజమేనని.. కానీ సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యం విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.

ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ..

పురపాలక సంఘం అధికారులకు తమ సమస్యపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. పురోగతి కనిపించటం లేదని వాపోతున్నారు.

ఇదీ చూడండి: పోలీసంటే పెళ్లికి నో చెప్పేసింది... అప్పుడా కానిస్టేబుల్ ఏం చేశాడంటే!

New Delhi, Oct 12 (ANI): Reacting to the current situation in Jammu and Kashmir post the revocation of Article 370 on August 05, Rashtriya Swayamsevak Sangh leader Indresh Kumar said the Jammu and Ladakh regions are in "happy place", whereas the Kashmir region is "waiting" for happiness. Kumar defended the government's decision to house arrest of several regional politicians in J-K ahead of revoking the special status of the state by saying that leaders who were talking against the interest of India were put under house arrest temporarily, adding that these leaders should talk about Kashmiriyat when they are released.
Last Updated : Oct 13, 2019, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.