ETV Bharat / bharat

భళా విద్యార్థి: నీటిని శుభ్రం చేసే 'సైకిల్' ఆవిష్కరణ

వినూత్న ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్నాడు కర్ణాటక సురపుర్​కు చెందిన ఓ విద్యార్థి. స్వచ్ఛ భారత్​ కార్యక్రమానికి తన వంతుగా పాటుపడాలనే లక్ష్యంతో చెరువులో నీటిని శుభ్రం చేసే సరికొత్త సైకిల్​ను రూపొందించాడు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

author img

By

Published : Oct 9, 2020, 7:41 AM IST

cycle for lake cleaning
చెరువు నీటిని శుభ్రం చేసే సైకిల్​
చెరువు నీటిని శుభ్రం చేసే సైకిల్​

ప్రజలకు ఒకప్పుడు మంచి నీటి అవసరాలు తీర్చిన చెరువుల పరిస్థితి దారుణంగా తయారైంది. సరైన నిర్వహణ లేక చాలా ప్రాంతాల్లోని చెరువులు.. నాచు, మురుగు నీరు, ప్లాస్టిక్​ వస్తువులతో కలుషితమై కనిపిస్తున్నాయి. వాటిని శుభ్రం చేసేందుకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా లాభం లేకుండా పోతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్​ కార్యక్రమంలో తనూ భాగమవ్వాలనే ఉద్దేశంతో సరికొత్త ఆవిష్కరణ చేశాడు కర్ణాటక సురపుర్​ నగరానికి చెందిన ఓ విద్యార్థి. చెరువు నీటిని శుభ్రపరిచే సరికొత్త సైకిల్​ను రూపొందించాడు.

సురపుర్​కు చెందిన సాహిల్​ గిరీష్​ కులకర్ణి అనే 10వ తరగతి విద్యార్థి.. ఇప్పటికే పలు శాస్త్రీయ ఆవిష్కరణలతో ఔరా అనిపించాడు. రూ.20కే వెల్డింగ్ చేసే పరికరాన్ని తయారు చేశాడు. ఎల్​ఈడీ బల్బులను రిపేర్​ చేయటం, ఇంటి మ్యాప్​ వంటి పలు ప్రయోగాలతో అందరి మన్ననలు పొందాడు.

మాజీ రాష్ట్రపతి డా.ఏపీజే అబ్దుల్​ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు సాహిల్​ను అభినందించారు. ఇప్పుడు నీటిని శుభ్రం చేసే యంత్రాన్ని రూపొందించాడు. ఇది బావులు, చెరువులు, సరస్సుల వంటి వాటిలోని నీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగించవచ్చని చెబుతున్నాడు. సాహిల్​కు ఈత కొట్టటం రాదు.. కానీ, తాను రూపొందించిన సైకిల్​పై చెరువంతా తిరుగుతున్నాడు.

సాహిల్​.. ప్రస్తుతం సర్వోదయ విద్యా సంస్థలో 10వ తరగతి చదువుతున్నాడు. తమ విద్యార్థి సాధించిన ఘనత పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. తాను ఎరోనాటికల్​ సైన్స్​ చదవాలనుకుంటున్నట్లు చెబుతున్నాడు సాహిల్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.