ETV Bharat / bharat

బంగాల్​లో ఆందోళనలు- వర్సిటీ ఆస్తులు ధ్వంసం

బంగాల్ బీర్భమ్ జిల్లాలోని విశ్వభారతి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హింస చెలరేగింది. పౌష్ మేళా కార్యక్రమం నిర్వహించే మైదానంలో సరిహద్దు గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా 4 వేల మంది ప్రజలు గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ గేటును పడగొట్టారు. యూనివర్సిటీ ఆస్తులు ధ్వంసం చేశారు.

Boundary wall triggers tension at Visva Bharati campus
బంగాల్​లో ఆందోళనలు- యూనివర్సిటీ ఆస్తుల ధ్వంసం
author img

By

Published : Aug 17, 2020, 5:09 PM IST

బంగాల్ బీర్భమ్ జిల్లాలోని విశ్వభారతి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. 'పౌష్ మేళా' ఉత్సవం నిర్వహించే మైదానంలో సరిహద్దు గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు.

Boundary wall triggers tension at Visva Bharati campus
గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన

శాంతినికేతన్ క్యాంపస్ వద్ద 4 వేల మందికిపైగా ప్రజలు గుమిగూడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి యూనివర్సిటీ గేటును పడగొట్టినట్లు వెల్లడించాయి. పలు ఆస్తులను ధ్వంసం చేశారని తెలిపాయి. ఘటనా స్థలంలో దుబ్రాజ్​పుర్​కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేశ్ బౌరీ సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన

యూనివర్సిటీ నిర్ణయమే!

పౌష్ మేళా వార్షిక శీతాకాల ఉత్సవం జరిగే మైదానం చుట్టూ గోడ నిర్మించాలని విశ్వవిద్యాలయ అధికారులే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు జాతీయ హరిత ట్రైబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణ పనులు ఈ ఉదయం ప్రారంభమైనట్లు సమాచారం.

తాజా ఆందోళనలపై స్పందించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు నిరాకరించారు.

బైఠాయింపు

మైదానం చుట్టూ గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా సుమారు 50 మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్థానిక ఆశ్రమ నివాసితులు నిరసన చేపట్టారు. యూనివర్సిటీలోని ప్రార్థనా మందిరం వద్ద గంట సేపు బైఠాయించారు.

సరిహద్దు గోడను నిర్మించడం ద్వారా పౌష్ మేళా మైదానంలోకి ప్రజలు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని విశ్వ భారతి ఎస్ఎఫ్ఐ నాయకుడు సోమనాథ్ సా అన్నారు. ఘటనకు సంబంధించి భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.

నిర్వహించి తీరుతాం

శతాబ్దాలనాటి పౌష్ మేళాను ఈ సంవత్సరం నుంచి నిలిపివేస్తున్నట్లు శనివారం యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. మైదానం చుట్టూ గోడ నిర్మించకుండా స్థానిక వ్యాపారులు అడ్డు చెప్పారు. మరోవైపు పౌష్ మేళాను నిర్వహించి తీరుతామని వర్తక సంఘాలు తేల్చి చెబుతున్నాయి. ఈ మేళా శాంతినికేతన్ వారసత్వంలో కలిసిపోయిందని స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి-మోదీ ఎఫెక్ట్​: భారత్​తో చర్చలకు చైనా సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.