బంగాల్ బారాబని ప్రాంతంలో 'అర్ నోయ్ అన్యాయ్' పేరిట భాజపా చేపట్టిన ప్రచార కార్యక్రమంలో బాంబుల దాడి కలకలం రేపింది. భాజపా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మధ్య జరిగిన ఈ దాడిలో కమలం పార్టీ కార్యకర్త ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో పలు మోటార్‌సైకిళ్లు దగ్ధమయ్యాయి. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలంలో బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
తమ ప్రచారాన్ని అడ్డుకునేందుకే టీఎంసీ ఈ దాడులకు పాల్పడిందని భాజపా నేతలు బాబుల్ సుప్రియ, కైలాశ్ విజయబార్గియా, దిలీప్ ఘోష్‌లు ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలను ఖండించింది టీఎంసీ. తొలుత ఆ పార్టీ నాయకులే దాడి చేశారని.. ఉద్దేశపూర్వకంగా తమ పార్టీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: రైతు సంఘాలతో కేంద్రమంత్రుల చర్చ