అడవి పందులను వేటాడటానికి ఏర్పాటు చేసిన నాటు బాంబును ప్రమాదవశాత్తు కొరికి ఓ ఆవు తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన ఒడిశా గంజాం జిల్లా ఖాలికోటే మండలం కెందుపత్ గ్రామంలో మంగళవారం జరిగింది.
అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు పొలాల్లో నాటు బాంబులను ఏర్పాటు చేశారు. కెందుపత్ గ్రామంలోని సుదురు రౌత్‌కు చెందిన గోమాత ఎప్పటిలానే మేతకు వెళ్లింది. వేటగాళ్లు అమర్చిన బాంబును పండుగా భావించి కొరికింది. దీంతో బాంబు నోట్లో పేలి ఆవుకు తీవ్రగాయాలయ్యాయి.
ఇదీ చదవండి : దేశంలోని వృద్ధ సింహం మృతి