జమ్ముకశ్మీర్ ఖాజీకుండ్ ప్రాంతంలోని లోయర్ ముందాలో ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది పౌరులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఘటనాస్థలంలో పడిపోయిన ఓ బాంబ్‌షెల్ ప్రస్తుతం పేలి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవాళ ఉదయం ఈ ప్రదేశంలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. దీంతో ముష్కరులు సైనికులపై ఒక్కసారిగా కాల్పులకు తెగించారు. ఇరుపక్షాల మద్య హోరాహోరీగా సాగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.