మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అధికార భాజపా, శివసేన కూటమి సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.
శివసేన 126 సీట్లలో పోటీ చేస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఫడణవీస్ కొట్టిపడేశారు. సీట్ల పంపకాలపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై స్నేహపూర్వకంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. తమ కూటమి మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని ఫడణవీస్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'విక్రమ్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించలేకపోయాం'