ETV Bharat / bharat

ఓట్ల శాతం పెరిగినా దిల్లీలో భాజపా ఓడింది అందుకే... - delhi election result analysis

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ద్విముఖ పోరు కారణంగానే ఆప్​ చేతిలో ఓటమి పాలయ్యామని భాజపా ఓ అంచనాకు వచ్చింది. గతంతో పోలిస్తే తమకు ఓట్లశాతం  పెరిగినా... కాంగ్రెస్ చతికిలబడటం వల్ల ఓటమి తప్పలేదని భావిస్తోంది పార్టీ అధిష్ఠానం.

delhi, bjp
దిల్లీ భాజపా
author img

By

Published : Feb 13, 2020, 5:16 PM IST

Updated : Mar 1, 2020, 5:39 AM IST

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి విజయఢంకా మోగించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ప్రచార పర్వంలో జాతీయ పార్టీలతో సీఎం అరవింద్ కేజ్రీవాల్​ తలపడ్డారు. చివరకు జాతీయ పార్టీలను కాదని ఆప్​ను సింహాసనంపై కూర్చొబెట్టారు హస్తిన ప్రజలు.

దిల్లీలో 70 స్థానాలకు గాను ఆప్​ 62 కైవసం చేసుకోగా.. మిగిలిన 8 స్థానాలను భాజపా గెలుచుకుంది. ఆప్​ 53.57 శాతం, భాజపా 38.51 శాతం, కాంగ్రెస్ 4.26 శాతం ఓట్లు సాధించాయి. ఆప్​ కన్నా ముందు దిల్లీని 15 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది.

bjp, aap voteshare
ఆప్, భాజపా ఓట్లశాతం

చతికిలబడిన కాంగ్రెస్​..

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల కాగానే ఆప్​, భాజపా, కాంగ్రెస్​ పార్టీలు ప్రచారాలను హోరెత్తించాయి. పోలింగ్​ సమయం దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పట్టు కోల్పోయినట్లు కనిపించింది. దిల్లీ ఎన్నికలు ద్విముఖ పోరుగానే సాగాయి.

ఇదే కారణంతో తాము ఓటమి పాలయ్యాయమని భాజపా భావిస్తోంది. ఓట్ల శాతం గతంతో పోలిస్తే పెరిగినా.. స్థానాలను కైవసం చేసుకోవటంలో మాత్రం వెనకపడ్డామని అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.

భాజపా సమీక్ష

ఓటమిపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.. దిల్లీ పార్టీ అధ్యక్షుడు మనోజ్​ తివారి, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్​తో సమీక్ష నిర్వహించారు. దిల్లీలో పూర్తి బలంతో పోరాడామని.. రాజధాని ఓటర్లకు మరింత చేరువయ్యామని ఈ సమావేశంలో నేతలు గుర్తించినట్లు సమాచారం.

2015 ఎన్నికలతో పోల్చితే భాజపాకు ఈసారి 8 శాతం ఓట్లు పెరిగాయి. అయితే ద్విముఖ పోరు కారణంగానే విజయం సాధించలేకపోయినట్లు పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్​ ప్రభావం తగ్గడం వల్ల ఓట్ల చీలిక సాధ్యపడలేదని విశ్లేషించినట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో ఆప్​తో ముఖాముఖి యుద్ధానికి సిద్ధం అయ్యేలా ప్రణాళికలు రచించాలని భాజపా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం మరిన్ని సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'ఎవరికీ ఆహ్వానం లేదు.. ప్రజల మధ్యే కేజ్రీ ప్రమాణం'

Last Updated : Mar 1, 2020, 5:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.