ETV Bharat / bharat

'బిహార్​లో ఎన్​డీఏ గెలుపునకు అసలు కారణం ఆర్​జేడీ' - అసదుద్దీన్​ ఓవైసీ

బిహార్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఆర్​జేడీ-కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. భాజపాకు సహాయం చేస్తోంది తాము కాదని.. ఆర్​జేడీయేనని ఆరోపించారు. తమకు పాఠాలు నేర్పించే అర్హత కాంగ్రెస్​కు లేదన్నారు.

BJP-led NDA is winning in Bihar due to RJD: Owaisi
'బిహార్​లో ఎన్​డీఏ గెలుపునకు అసలు కారణం ఆర్​జేడీ'
author img

By

Published : Oct 5, 2020, 4:58 PM IST

బిహార్​ ఎన్నికల్లో భాజపాకు సహాయం చేయడానికే.. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్​ యాదవ్​తో ఏఐఎంఐఎం కలిసి పోటీ చేస్తోందన్న ఆరోపణలను ఆ పార్టీ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ ఖండించారు. భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ.. బిహార్​లో గెలవడానికి అసలు కారణం ఆర్​జేడీయేనని ఎదురుదాడి చేశారు.

"లౌకికవాదుల ఓట్లను చీలుస్తున్నానని నాపై ఆర్​జేడీ ఆరోపణలు చేస్తోంది. మరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్​జేడీ ఖాతా కూడా తెరవలేదు. దీనికి కూడా నేనే కారణమా? బిహార్​లోని మైనారిటీలు, లౌకికవాదుల ఓట్లు తమకే దక్కుతాయని ఆర్​జేడీ-కాంగ్రెస్​ తెగేసి చెబుతున్నాయి. వీరందరూ 2019లో ఎక్కడికి వెళ్లినట్టు? భాజపా వ్యతిరేక ఓట్లు వీరికి ఎందుకు దక్కలేదు? ఇన్ని జరిగినా.. బిహార్​లోని ముస్లింల ఓట్లు తమకే దక్కుతాయని వీళ్లు ఎలా అనుకుంటున్నారో నాకు మాత్రం అర్థం కావడంలేదు."

--- అసదుద్దీన్​ ఓవైసీ, ఏఐఎంఐఎం అధినేత.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్​జేడీ, కాంగ్రెస్​ సహా మరికొన్ని చిన్న పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్​ ఒక్కటి గెలవగా.. పార్టీ చరిత్రలోనే ఆర్​జేడీ తొలిసారిగా ఖాతా తెరవలేదు.

ఇదీ చూడండి:- దళిత నేత హత్య కేసులో తేజస్వీ​పై ఎఫ్ఐఆర్​

'కాంగ్రెస్​కు ఆ అర్హత లేదు..'

కాంగ్రెస్​పైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఓవైసీ. మహారాష్ట్ర ఎన్నికల్లో తమతో కలిసి బరిలో దిగిన కాంగ్రెస్​.. చివరకు 'బాబ్రీ ఘటన'కు కారణమైన శివసేనతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. తమకు లౌకికవాదాన్ని నేర్పించే అర్హత కాంగ్రెస్​కు లేదని తేల్చిచెప్పారు.

బిహార్​ ఎన్నికల కోసం... దేవేంద్ర యాదవ్​ నేతృత్వంలోని సమాజ్​వాదీ జనతా దళ్​(డీ)తో కలిసి యూడీఎస్​ఏ(యునైటెడ్​ డెమొక్రటిక్​ సెక్యులర్​ అలయన్స్​)ను ఏర్పాటు చేశారు ఓవైసీ. ఇతర ఎన్​డీఏ వ్యతిరేక పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:- బిహార్ బరి: తేలిన మహాకూటమి లెక్క.. కాంగ్రెస్​కే ప్రయోజనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.