బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను నియమించింది భాజపా. ఈ మేరకు ఆ పార్టీ అధిష్ఠానం ఓ ప్రకటన జారీ చేసింది.
బిహార్‌లో జరగబోయే ఎన్నికల వ్యూహాలు, సీట్ల పంపకంపైనా భారతీయ జనతా పార్టీ(భాజపా) కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్ర భాజపా నాయకులతో చర్చలు జరుపుతున్నారు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ నేపథ్యంలో ఎన్నికల ఇంఛార్జిగా ఫడణవీస్‌ను ప్రకటించారు.
గడిచిన కొన్ని వారాలుగా బిహార్ ఎన్నికలపై జరుగుతున్న పార్టీ సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా పలుమార్లు బిహార్‌లో పర్యటించారు ఫడణవీస్. సీనియర్ నాయకుడిని ఇంఛార్జిగా నియమించాలనే కారణంతోనే ఫడణవీస్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.
భాజపా, జేడీ(యూ), ఎల్జేపీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగనుంది. అయితే భాజపాతో ఎల్జేపీకి పొత్తు కుదరడం లేదు. పలు అంశాల్లో భాజపా నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎల్జేపీ... ఒంటరిగా పోటీ చేయాలా? వద్దా అనే సందిగ్ధంలో ఉంది.
ఇదీ చూడండి: బిహార్ బరి: అగ్రవర్ణాల ప్రభావమెంత ?