బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో మరోమారు తమ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం భారతీయ జనతా పార్టీ. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ నేతృత్వంలో శనివారం 70 మందితో ఎన్నికల స్టీరింగ్ కమిటీని ప్రకటించింది. రాయ్ ఛైర్మన్, కన్వీనర్‌గా వ్యవహరించనుండగా.. పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి దేవేశ్ కుమార్ కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారని బిహార్ భాజపా చీఫ్ సంజయ్ జైస్వాల్ తెలిపారు.
''70 మందితో కూడిన కమిటీలో బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, గిరిరాజ్ సింగ్, అశ్వినీ కుమార్ చౌబేలు సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచార బృందానికి కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వం వహిస్తారు. పార్టీ ఎన్నికల నిర్వహణ బృందానికి బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగల్ పాండే.. ఛైర్మన్, కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మేనిఫెస్టో కమిటీకి వ్యవసాయ శాఖ మంత్రి ప్రేమ్ కుమార్ నేతృత్వం వహిస్తారు.''
- సంజయ్ జైస్వాల్, బిహార్ భాజపా చీఫ్
243 స్థానాలు కలిగిన బిహార్ అసెంబ్లీకి వచ్చే అక్టోబర్-నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు నాలుగింట మూడొంతుల సీట్లు సాధించాలనే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోందని భాజపా.
ఇదీ చూడండి: మాంఝీ ఎంట్రీ.. ఎన్డీఏలో లుకలుకలు!