ETV Bharat / bharat

అంతర్జాతీయ స్థాయిలో 'బయోకాన్‌'కు అరుదైన గౌరవం

భారత ఫార్మా బయోకాన్​కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా టాప్​-5లో చోటు దక్కించుకుంది. రీజెనరాన్​, అలిమినిలామ్​, ఇన్​సైట్​, జింజెంటా కంపెనీలు.. వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Biocon Ranked Among Top 5 Biotech Employers Globally
అంతర్జాతీయ అగ్రగామిలో ‘బయోకాన్‌’కు అయిదో ర్యాంకు
author img

By

Published : Oct 31, 2020, 11:19 AM IST

Updated : Oct 31, 2020, 12:43 PM IST

అంతర్జాతీయంగా అత్యుత్తమ ఫార్మా కంపెనీల జాబితాలో బయోకాన్​ టాప్​-5గా నిలిచింది. అమెరికాకు చెందిన ‘సైన్స్‌’ మ్యాగజైన్‌ తన వార్షిక ‘సైన్స్‌ కెరీర్‌ టాప్‌- 20 ఎంప్లాయర్స్‌’ జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2018లో బయోకాన్‌ ఏడో ర్యాంకులో ఉండగా.. 2019లో ఆరో ర్యాంకు, తాజాగా ఐదో స్థానంలో నిలిచింది.

కరోనా పరిస్థితుల్లోనూ.. తమ సంస్థ ఐదో ర్యాంకు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు బయోకాన్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్​పర్సన్​ కిరణ్ మజుందార్​ షా.

“పరిశ్రమలో వినూత్నతకు పెద్దపీట వేసే నాయకత్వం, ‘సామాజిక బాధ్యత’, ‘విశ్వాసపాత్రులైన ఉద్యోగులు’.. ఈ మూడు కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చారు. ‘కరోనా కారణంగా పలు అవరోధాలు ఎదురైనా మా ఉద్యోగులు కీలక తయారీ, నాణ్యత, సరఫరా కార్యకలాపాలకు ఊతమిచ్చారు. రోగులు, భాగస్వాములపై ప్రతికూల ప్రభావం పడకుండా చూశారు.”

- కిరణ్‌ మజుందార్‌షా, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌

తొలి నాలుగు స్థానాల్లో రీజెనరాన్‌, అలినిలామ్‌, ఇన్‌సైట్‌, జింజెంటా ఉన్నాయి.

ఇదీ చదవండి- హైటెక్​ యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్​

Last Updated : Oct 31, 2020, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.