బిహార్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజుల నుంచి కురుస్తున్న వానల కారణంగా పలు గ్రామాలు నీటమునిగాయి. జన జీవనం స్తంభించింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పశ్చిమ చంపారన్ జిల్లా మంగళ్పుర్ కాలా గ్రామం వరదల ధాటికి నీటమునిగింది. పలు ఇళ్లు సగానికి పైగా జలదిగ్బంధమయ్యాయి. దీంతో చాలా మంది ప్రజలు ఇంటిపై కప్పు మీదకు ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఆరు రోజులుగా ఇంటిపైనే ఉంటున్నామని.. అధికారులెవ్వరూ ఇంతవరకు రాలేదని వాపోతున్నారు. భార్య, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారు మాత్రం ఇంట్లోని వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోకుండా కాపలా కాస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:'షా'తో ఫడణవిస్ భేటీ 'ఆపరేషన్ కమలం' కోసమా?