ETV Bharat / bharat

బిహార్​ బరి: 'రాఘోపుర్'​పైనే అందరి గురి

రాఘోపుర్... బిహార్​లోని శాసనసభ నియోజకవర్గం. లాలూ కుటుంబ కంచుకోటల్లో ఒకటి. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​ పోటీ చేస్తోంది ఆ స్థానం నుంచే. అలాంటి రాఘోపుర్​లో జయకేతనం ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భాజపా. అయితే... నిన్నమొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న ఎల్​జేపీనే కమలదళం విజయ తీరాలకు చేరకుండా అడ్డుపడేలా కనిపిస్తోంది. ఎందుకలా? రాఘోపుర్​లో ఏం జరుగుతోంది?

Bihar elections
బిహార్​ బరి: రసవత్తర రాజకీయాలకు వేదికగా.. రఘోపూర్​ సీటు !
author img

By

Published : Oct 21, 2020, 5:32 PM IST

రంజుగా సాగుతున్న బిహార్​ రాజకీయాల్లో ప్రస్తుతం అన్ని పార్టీల దృష్టి.. రాఘోపుర్ నియోజకవర్గంపై పడింది. ఆర్​జేడీకి ప్రతిష్టాత్మకమైన ఈ స్థానంలో... లాలూ తనయుడిని కంగు తినిపించాలని భాజపా ఊవిళ్లూరుతోంది. అదే సమయంలో ఎల్​జేపీ.. తమ అభ్యర్థిని బరిలో నిలిపి, ఓట్లు చీల్చుతుందని కమలదళం కలవరపడుతోంది.

రసవత్తర పోరు..

ఇలా రసవత్తర పోరు సాగుతున్న రాఘోపుర్​ గడ్డపై.. ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత సతీశ్ కుమార్​ నామినేషన్లు దాఖలు చేశారు. హాజీపుర్ లోక్​సభ స్థానం పరిధిలో ఉండే రాఘోపుర్​లో దాదాపు 3లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రీయ జనతాదళ్​ కంచుకొటల్లో ఇదీ ఒకటి. గత రెండు దశాబ్దాల్లో ఈ స్థానంలో ఆర్​జేడీ గట్టి పట్టు సాధించింది. 2015 ఎన్నికల్లో గెలుపొందిన తేజస్వీ యాదవ్ ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఆయనకు పోటీగా భాజపా ఈ స్థానం నుంచి సతీశ్​​ కుమార్​ను రంగంలోకి దింపింది. ఆయన 2010లో మాజీ ముఖ్యమంత్రి, లాలూ సతీమణి రబ్రీదేవిని ఓడించారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: కంచు కోటలపై పట్టు నిలిచేనా?

యాదవులదే హవా..

గంగానది పరీవాహక ప్రాంత్రంలో, రాజధాని పట్నాకు దగ్గరలోనే ఉన్న రాఘోపుర్​లో.. యాదవ ఓటర్లే అత్యధికంగా ఉంటారు. ఈ నియోజకవర్గానికి లాలూప్రసాద్​ యాదవ్​ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించగా.. 2005-10మధ్య రబ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2010లో జేడీయూ భాగస్వామ్యంతో ఈ సీటు గెలుచుకుంది. ప్రస్తుతం ఆర్​జేడీ నుంచి ఉదయ్​ నారాయణ్ వంటి కీలక నేతలు జేడీయూలోకి వెళ్లిపోవటం మరోసారి ఎన్డీఏలో ఆశలు రేకెత్తిస్తోంది.

సామాజిక వర్గాల సమీకరణలు పరిశీలిస్తే..

వర్గంఓటర్లు
యాదవులు 80,000
రాజ్​పుత్​35,000
పాసవాన్ 17,000
చౌరాసియా15,000

ఇదీ చూడండి: బిహార్​ బరి: తేజస్వీ ఓటమే లక్ష్యంగా భాజపా వ్యూహం

ఎల్​జేపీ కలవరం

అయితే, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన ఎల్​జేపీ ఒంటరిగా పోటీ చేస్తుండటం.. రాఘోపుర్ ఎన్నికను రసవత్తరంగా మార్చేస్తుంది. పాసవాన్ల పార్టీ రాకేశ్ రోషన్​ను పోటీలో నిలబెట్టింది. ఈ నేపథ్యంలో భాజపా అగ్రవర్ణాల ఓటు బ్యాంకు చీలే అవకాశం కనిపిస్తోంది. ఆర్​జేడీకి లాభం కలిగించేందుకే ఎల్​జేపీ ఇలా చేసిందని హెచ్ఏఎం ఆరోపిస్తోంది.

భాజపా సైతం ఎల్​జేపీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తేజస్వీ యాదవ్​ గెలుపు కోసం ఎల్​జేపీ పరోక్షంగా పనిచేస్తోందని కమలం నేతలు విమర్శిస్తున్నారు.

అయితే, ఎల్​జేపీ వర్గాలు మాత్రం గెలుపే లక్ష్యంగా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టినట్లు చెబుతున్నాయి. ఇలా రసవత్తరంగా సాగుతున్న రాఘోపుర్​ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో నవంబర్ 10న తేలనుంది.

ఇదీ చూడండి: ప్రశాంత్ కిశోర్​ ఎల్​జేపీ కోసం పని చేస్తున్నారా?

ఇదీ చూడండి: బిహార్​ బరి: కాంగ్రెస్​, ఎల్​జేపీల మేనిఫెస్టోలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.