బిహార్ డిప్యూటీ సీఎం, భాజపా నేత సుశీల్‌కుమార్ మోదీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం మెరుగైన చికిత్సకోసం పట్నా ఎయిమ్స్‌లో చేరినట్లు ఆయన తెలిపారు. త్వరలో కోలుకొని తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో తెలిపారు సుశీల్..
కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. జ్వరం వచ్చినట్లు ఉంటే మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరాను. వీలైనంత త్వరగా కోలుకొని ప్రచారంలో పాల్గొంటా.
-సుశీల్ కుమార్ మోదీ, బిహార్ ఉపముఖ్యమంత్రి
బిహార్ భాజపాలో కీలకనేతగా ఉన్నా మోదీ.. ఇటీవల కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధాని పర్యటనకు ముందు రోజు ఈ వార్త తెలియడం వల్ల భాజపా శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ప్రధాని మోదీ పాల్గొనే ర్యాలీల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో కలిసి సుశీల్ పాల్గొంటారని కార్యకర్తలు భావించారు.
ఇదీ చూడండి: 'బిహార్ ప్రజలకు ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్'