ఆగస్టు 11న బెంగళూరు డీజే హళ్లి, కేజే హళ్లిలో జరిగిన అల్లర్ల కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేపట్టింది. ఇప్పటివరకు పోలీసులు చేసిన విచారణను ఎన్ఐఏ కొనసాగించనుంది. ఈ మేరకు ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఐజీ హోదా ఉన్న అధికారి నేతృత్వంలోని బృందం బెంగళూరుకు చేరుకుందని ఎన్ఐఏ తెలిపింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి వ్యతిరేకంగా నిందితులపై డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్లు రిజిస్టర్ చేసిన రెండు కేసులను ఎన్ఐఏ తిరిగి నమోదు చేసింది.
అల్లర్ల నేపథ్యం
ఆగస్టు 11న రాత్రి 8 గంటల సమయంలో వెయ్యి మంది దుండగులు కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ శ్రీనివాస్ మూర్తి ఇంటి ముందు హింసాత్మక ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మేనల్లుడు ఫేస్బుక్లో అనుచిత పోస్టు చేసినందుకు నవీన్ ఇంటి ముందు విధ్వంసానికి పాల్పడ్డారు. తమ మనోభావాలు కించపరిచేలా పోస్టు ఉందని ఆరోపించారు. అనంతరం డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీసు స్టేషన్లపై దాడి చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటించారు. అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి- కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు.. ఘర్షణలో ముగ్గురు మృతి