ETV Bharat / bharat

బాబ్రీ కేసు​: 28 ఏళ్ల తర్వాత చారిత్రక తీర్పు!

author img

By

Published : Sep 29, 2020, 6:19 PM IST

బాబ్రీ మసీదు ఘటనకు 28 ఏళ్లు. మొత్తం 49 మంది నిందితులు. అందులో 17 మంది మరణించగా.. కోర్టులో హాజరవ్వనున్న ప్రముఖులు 32 మంది. వీరిలో ఒకరు మాజీ ఉప ప్రధాని, మిగిలినవారు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు. దర్యాప్తు తర్వాత అందించిన 600 పేజీల ఆధారాలు, 351మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల మేరకు చారిత్రక తీర్పు ఇవ్వనున్నారు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్ర యాదవ్​. ఇందుకు నిర్ణయించిన తేదీ సెప్టెంబర్​ 30. అంటే బుధవారమే.

babri-masjid conclude
బాబ్రీ కేసు​: 28 ఏళ్ల తర్వాత వెలువడుతోన్న చారిత్రక తీర్పు

ఏళ్ల పాటు జరిగిన విచారణ తర్వాత అనేక మలుపులు తిరిగిన చారిత్రక​ కేసులో.. ఎట్టకేలకు సెప్టెంబర్​ 30న తీర్పు వెలువడనుంది. మొత్తం 49 మంది నిందితుల్లో జీవించి ఉన్న 32 మంది బుధవారం జడ్జి ముందు కోర్టులో హాజరవ్వనునన్నారు. లఖ్​నవూ సీబీఐ కోర్టులో జడ్జి ఎస్కే కుమార్​ ఈ వివాదాస్పద అంశంలో కీలక తీర్పు ఇవ్వనున్నారు.

చారిత్రక బాబ్రీ మసీదులో ఘటనలో 28 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువరించటమే ఓ ప్రత్యేకత అయితే... ఈ కేసులో నిందితులుగా భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి, ఉమా భారతితో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్​ సింగ్​ వంటి వీవీఐపీలు ఉండటం వల్ల ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

బుధవారం ఉదయం వీరంతా సీబీఐ కోర్టులో హాజరవ్వాలన్న ఆదేశాలున్నాయి. అయితే, నిందితులుగా ఉన్న ప్రముఖులందరి వయస్సు పెద్దది కావటం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరెవరు హాజరవుతారన్న అంశంపై స్పష్టత లేదు.

బాబ్రీ కేసు పూర్వాపరాలు

1992, డిసెంబర్​ 6న లక్షలాదిమంది కరసేవకులు.. సుప్రీం కోర్టు అనుమతితో కర సేవ పేరుతో భారీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బాబ్రీ మసీదు వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హింస చెలరేగిన వెంటనే.. స్థానిక రామ్​ జన్మభూమి పోలీస్​ స్టేషన్​లో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

ఈ ఘటనలో లక్షలాదిమంది కర సేవకులను నిందితులుగా చేర్చారు. అయితే ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. మరో 10 నిమిషాల తర్వాత 6:25కు ఎల్​కే అడ్వాణీ సహా మరికొంత మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు.

రెండో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన తర్వాత స్థానిక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అనంతరం రెండవ రోజు ఈ కేసు సీబీసీఐడీకి బదిలీ అయ్యింది. రాష్ట్రంలో చెలరేగిన ఈ విధ్వంసానికి బాధ్యతవహిస్తూ.. నాటి యూపీ ముఖ్యమంత్రి కల్యాణ్​ సింగ్ రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటినుంచి ఈ అంశం రాజకీయమైంది.

ఇక దర్యాప్తులో భాగంగా సీబీసీఐడీ ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్​షీట్ దాఖలు చేసింది. తర్వాత ఈ కేసు పూర్తిగా సీబీఐ చేతికి వెళ్లింది.

అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి రెండు చోట్ల విచారణ మొదలైంది. రాయబరేలీలో ఈ కేసులోని ప్రముఖులకు సంబంధించిన విచారణ జరుగుతుండగా.. లఖ్​నవూలో ఇతర నిందితులకు సంబంధించిన కేసు నడుస్తుండేది. అయితే, సుప్రీం కోర్టు రాయబరేలీ కేసును కూడా లఖ్​నవూకు మార్చేసింది. ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టులోనే పూర్తి స్థాయిలో.. వివిధ కోణాల్లో ముగిసిన దర్యాప్తు, విచారణల అనంతరం సెప్టెంబర్​ 30న తీర్పు వెలువడేందుకు సర్వం సిద్ధమైంది.

ఈ కేసు విచారణ తీవ్రమైన నేరానికి కుట్రకు సంబంధించిన కోణంలో జరిగింది. అయితే, 2001లో ట్రయల్​ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అలహాబాద్​ హైకోర్టు 2010లో ఈ తీర్పును సమర్థించింది. కానీ 2017లో ఈ కేసుకు సంబంధించి అప్పీళ్లు రాగా హైకోర్టు తీర్పు సంస్పెండ్​ చేస్తూ మరోసారి విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రత్యేక జడ్జి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తూ రెండేళ్లలో తీర్పు వెలువరించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు.. ఈ ఏడాది అగస్టు 31న తీర్పు రావాల్సింది. సీబీబీ మరో నెల రోజులు గడువు కోరటం వల్ల సెప్టెంబర్​ 30కి వాయిదా పడింది.

నిందితులు:

ఎల్​ కే అడ్వాణీ,మురళీ మనోహర్​ జోషి, సుధీర్ కక్కర్, సతీష్​ ప్రధాన్, రాం చంద్ర ఖత్రి, సంతోష్​ దుబే, కల్యాణ్​ సింగ్, ఉమా భారతి, రాం విలాస్​ వేదాంతి, వినయ్​ కతియార్, ప్రకాశ్​ శర్మ, గాంధీ యాదవ్, జై భాన్​ సింగ్, లల్లూ సింగ్, కమలేశ్​ త్రిపాఠి, బ్రిజ్​ భూషన్​ సింగ్, రాంజీ గుప్తా, మహంత్ నృత్య గోపాల్​ దాస్, చంపత్​ రాయ్, సాక్షి మహారాజ్, వినయ్ కుమార్​ రాయ్, నవీన్​ భాయ్​ శుక్లా, ధర్మదాస్, జై భగవాన్​ గోయల్​, అమరనాథ్​ గోయల్​, సాధ్వి రితంభర, పవన్​ పాండే, విజయ్​ బహదూర్​ సింగ్​, ఆర్​ ఎం శ్రీవాస్తవ, ధర్మేంద్ర సింగ్​ గుజ్జర్​, ఓం ప్రకాశ్​ పాండే, ఆచార్య ధర్మేంద్ర

మరణించిన నిందితులు:

పరమహంస రామచంద్ర దాస్​, వినోద్​ కుమార్​ వత్స్, రాం నారాయణ్ దాస్​, డీబీ రాయ్​, లక్ష్మీ నారాయణ దాస్​, హర్​గోవింద్​ సింగ్​, రమేష్​ ప్రతాప్​ సింగ్​, దేవేంద్ర బహదూర్, ఆశోక్​ సింఘాల్​, గిరిరాజ్​ కిశోర్​, విష్ణుహరి దాల్మియా, మోరేశ్వర్​, మహంత్​ జగదీశ్​ ముని మహరాజ్​, వైకుంఠ్ లాల్​ శర్మ, సతీష్​ కుమార్​ నాగర్​, బాలా సాహెబ్​ ఠాక్రే

ఇదీ చూడండి: ఈ నెల 30న బాబ్రీ కేసుపై తీర్పు

బాబ్రీ కేసు టైమ్​లైన్​

1992, డిసెంబర్​ 6- బాబ్రీ మసీదు ఘటన. ఫైజాబాద్​లో రెండు కేసుల నమోదు. అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి, బాల్​ ఠాక్రే, ఉమా భారతితో పాటు 49మందిపై క్రిమినల్​ కేసు​ నమోదు.

1993- సీబీఐ చేతికి ఈ హై-ప్రొఫైల్ కేసు దర్యాప్తు. కరసేవకులు, 49మంది నేతలపై రాయబరేలీ, లఖ్​నవూలో దర్యాప్తు ప్రారంభం. భాజపా అగ్రనేతలను నేరానికి కుట్ర కేసులో భాగం చేసిన దర్యాప్తు సంస్థ.

​1996- రెండు కేసులను కలుపుతూ నోటిఫికేషన్​ విడుదల చేసిన యూపీ సర్కార్​. కేసుపై అడ్వాణీ సహా నేతలు సవాల్​ చేయగా.. రెండింటిని నేర కుట్ర విభాగంలోకి చేర్చిన సీబీఐ.

2001, మే 4- అడ్వాణీ సహా ఇతన నేతలపై నేరారోపణలను కొట్టేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.

2003- మరో ఛార్జ్​షీట్​ దాఖలు చేసిన సీబీఐ. అడ్వాణీకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవన్న రాయబరేలీ కోర్టు. హైకోర్టు జోక్యంతో తిరిగి కొనసాగిన విచారణ.

2010, మే 23- అడ్వాణీ సహా ప్రముఖులపై నేరానికి కుట్ర కేసును కొట్టేసిన అలహాబాద్​ హై కోర్టు.

2012- అలహాబాద్​ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ. పునర్విచారణ చేపట్టాలని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.

2017, ఏప్రిల్- రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు. రాయబరేలీ కేసును సైతం లఖ్​నవూలోనే కలిపి విచారించాలని ఉత్తర్వులు.

2017-మే- ప్రారంభమైన రోజువారీ విచారణ. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి. నిందుతులందరికీ ముందస్తు బెయిల్​ కోరిన అడ్వాణీ.

2020 జులై- కరోనా కారణంగా అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి వాంగ్మూలాన్ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా రికార్డు చేసిన న్యాయస్థానం

2020, మే 8- అగస్టు 31 నాటికల్లా విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు. కరోనా కారణంగా సెప్టెంబర్​ 30 వరకు పొడిగింపు.

ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర యాదవ్​.. సెప్టెంబర్​ 1 నాటికి కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు, వాంగ్మూలాలు, వాద-ప్రతివాదనలు విన్న తర్వాత సెప్టెంబర్​ 2 నుంచి తీర్పు రాయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 30న చార్రితక కేసులో తీర్పు వెలువరిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి: 'బాబ్రీ' తీర్పు నేపథ్యంలో లఖ్​నవూలో భద్రత కట్టుదిట్టం

ఇదీ చూడండి: బాబ్రీ' పరిమాణంలోనే అయోధ్య మసీదు: ఐఐసీఎఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.