బాబ్రీ మసీదు కేసు విచారణ పూర్తి చేసేందుకు మరో 6 నెలలు సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు ప్రత్యేక న్యాయమూర్తి.
తన పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగుస్తుందని గత మే నెలలోనే సర్వోన్నత న్యాయస్థానానికి లేఖ రాశారు ప్రత్యేక జడ్జి.
విచారణ సమయం పొడగింపుపై జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. బాబ్రీ కేసు తీర్పు వెలువరించే వరకు ప్రత్యేక జడ్జి పదవీ కాలం పొడగించాలా వద్దా అనే విషయాన్ని ఈ నెల 19లోపు తెలపాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేసు విచారణ రెండేళ్లలోపు పూర్తి చేయాలని 2017, ఏప్రిల్ 19న ప్రత్యేక న్యాయమూర్తిని ఆదేశించింది సుప్రీం కోర్టు.
ఇదీ చూడండి: అయోధ్య కేసు: జులై 25 నుంచి రోజూ విచారణ!