ETV Bharat / bharat

కరోనా పోరులో ఆయుర్వేదమే భారత్​ అస్త్రం!

విశ్వ మహమ్మారి కరోనాపై పోరుకు ఆయుర్వేద ఔషధాల్నీ ఎంచుకుంది భారత్‌. కరోనా రోగులపై క్లినికల్​ ట్రయల్స్​లో నాలుగు ఆయుర్వేద మందులను ప్రయోగిస్తున్నట్టు ఆయుష్‌ శాఖ సలహాదారు డాక్టర్​.డీకే కటోచ్.. ఈటీవీ భారత్​కు​ వెల్లడించారు.

four Ayush formulations against COVID-19
కరోనా పోరులో ఆయుర్వేదమే భారత్​ అస్త్రం
author img

By

Published : May 24, 2020, 3:09 PM IST

Updated : May 24, 2020, 9:10 PM IST

కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇదే బాటలో భారత్​లోని ఆయుష్​ విభాగం కూడా కీలక పరిశోధనల్లో భాగస్వామ్యమైంది. జనరిక్​ మందులే కాకుండా ఆయుర్వేదంతోనూ కొవిడ్​కు చెక్​ పెట్టాలని చూస్తోంది​. అందుకు సంబంధించిన విషయాలను ఈటీవీ భారత్​కు ప్రత్యేకంగా వెల్లడించారు ఆయుష్​ మంత్రిత్వ శాఖ సలహాదారుడు డాక్టర్​. డీసీ కటోచ్

four Ayush formulations against COVID-19
ఆయుష్​ మంత్రిత్వ శాఖ సలహాదారుడు డాక్టర్​.డీసీ కటోచ్

సీఎస్​ఐఆర్​ ఆధ్వర్యంలో...

"సాంకేతిక, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్)‌, భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)‌ సహాయంతో ఆయుష్‌, వైద్య, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా.. నాలుగు ఆయుర్వేద ఔషధాలతో ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్​ చేస్తున్నాం. అవి అశ్వగంధ, యష్టిమధు(ములేతి), గుడూచి+పిప్పలి(గిలోయ్​), పాలీ హెర్బల్‌ ఫార్ములేషన్‌ (ఆయుష్‌-64). కరోనా కట్టడిలో ఆయుర్వేదంతో వచ్చే ఫలితాలను పరిశీలిస్తున్నాం. ఈ మందులు మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి.. వైరస్​ శరీరంలోకి వైళ్లకుండా నియంత్రిస్తాయి. అయితే ఇవి ఏ మేరకు రక్షణ కల్పిస్తున్నాయి? అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం" అని తెలిపారు కటోచ్​.

"భారత్​లో కరోనా కట్టడి గురించి ఆయుష్​ మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో మనిషి ఎలా వ్యాధి నుంచి రక్షించుకోవచ్చో చెప్పాం. దీనికి మంచి స్పందన లభించింది. అందరూ ఆమోదయోగ్యమని తెలిపారు"

-- డాక్టర్​.కటోచ్​

మరి బాధితులపై..?

దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రఖ్యాత వైద్య సంస్థలు ఆయుర్వేదంతో క్లినికల్​ ట్రయల్స్​లో భాగమయ్యాయని చెప్పారు ఆయుష్​ ఆర్​&డీ టాస్క్​ఫోర్స్​ సారథి డాక్టర్​ భూషణ్​ పత్వర్ధన్​. ప్రస్తుతం వైద్య నిపుణులు రెండు అంశాలపై ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. సార్స్​-కోవ్​-2ను ముందస్తు నియంత్రణకు అశ్వగంధ ఏ మేరకు ఉపయోగపడుతుంది.? హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పోలిస్తే కొవిడ్‌-19ను అడ్డుకోవడం, నియంత్రించడం, నయం చేయడంలో అది ఎంత సమర్థంగా పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు.

మరో పరిశోధనలో స్వల్ప, ఎక్కువ కరోనా లక్షణాలున్న వారిలో ఆయుర్వేద ఔషధాలతో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఎంత మేర వ్యాధిని నియంత్రించగలుగుతున్నాం? బాధితులు ఎంతవేగంగా కోలుకుంటున్నారు? వాటి పనితీరు ఎలా ఉంది? వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్ధన్​.. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయుర్వేదం వాడొచ్చని ప్రజలకు సూచించారు.

ఛార్లెస్​కు చికిత్స నిజమేనా...!

కరోనా బారిన పడ్డ బ్రిటన్‌ యువరాజు ఛార్లెస్‌కు ఆయుర్వేదంతోనే నయమైందని కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపాద్‌ యశోనాయక్‌ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు డాక్టర్​.కటోచ్​. యువరాజు ఛార్లెస్​ ప్రాచీన వైద్య విధానాలకు మద్దతుదారుడని పేర్కొన్నారు.

"మన రోగ నిరోధక వ్యవస్థపై కరోనా వైరస్‌ దాడి చేస్తుంది. రోగనిరోధకతను పెంచుకుంటే వైరస్‌ దాడి చేయలేదు. శ్వాస వ్యవస్థ దెబ్బతింటే దానిని బాగుచేసే పరిష్కారము మనవద్ద ఉంది. ఛార్లెస్​ మనదేశానికి వస్తే ఆయుర్వేద చికిత్స తీసుకునేవారు. ఆయన హోమియోపతిని ప్రోత్సహిస్తారు"

-- డాక్టర్​.కటోచ్​

హోమియోపతి వైద్యంతో యువరాజు కోలుకున్నారన్న వార్తల్ని బ్రిటన్​ అధికార ప్రతినిధి ఖండించారు. బ్రిటన్​ జాతీయ ఆరోగ్య సంస్థ సూచించిన చికిత్సను మాత్రమే చార్లెస్ తీసుకున్నారని స్పష్టంచేశారు. దీనిపై మళ్లీ స్పందించిన కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపాద్‌ పశ్చిమ దేశాలు ఆయుర్వేదాన్ని ఆమోదించే పరిస్థితి లేనందునే బ్రిటన్‌ రాజ కుటుంబం ఈ విషయాన్ని తోసిపుచ్చుతోందన్నారు. ఆయుర్వేదం వల్లనే ఛార్లెస్‌కు నయమైందనేది నూటికి నూటొక్క శాతం వాస్తవమని స్పష్టం చేశారు.

Last Updated : May 24, 2020, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.