

బాబ్రీ ఘటన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్‌ప్రదేశ్ పరిధిలోని భూమికి సంబంధించి చట్టం చేసే అధికారం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. రామ్‌లల్లా భక్తులమంటూ కొందరు న్యాయవాదుల బృందం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒకరాష్ట్రం పరిధిలోని ఆధ్యాత్మిక సంస్థల నిర్వహణకు సంబంధించి చట్టాలు చేసే ప్రత్యేక అధికారం రాష్ట్ర శాసనసభలకే ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు.