అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రదేశం నుంచి రాముడి విగ్రహాన్ని తాత్కాలికంగా మరొక చోటుకు తరలించారు. ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి.
ఈ విగ్రహాన్ని 9.5 కిలోల వెండి సింహాసనంపై పెట్టారు. రామ మందిర నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగిన తర్వాత ఈ ప్రతిమను ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు.
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు ఎవరినీ ఆహ్వనించలేదు. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు, విశ్వ హిందూ పరిషత్‌కు చెందిన వారు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా 'సామాజిక దూరం' నిబంధనలు ఉల్లంఘించారని యోగి ఆదిత్యనాథ్‌పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఇదీ చూడండి:-'పొరపాటు జరిగింది... ఆయన మృతికి కరోనా కారణం కాదు
'