ETV Bharat / bharat

అయోధ్య వివాదం ఆరంభం నుంచి భూమిపూజ వరకు..

author img

By

Published : Aug 5, 2020, 7:32 AM IST

రామ మందిర భూమిపూజ కోసం అయోధ్య సిద్ధమైంది. ప్రధాని చేతుల మీదుగా నేడు వేడుక జరగనుంది. శంకుస్థాపన కార్యక్రమం 32 సెకన్ల పాటు నిర్వహించనుండగా.. దీన్ని దూరదర్శన్​లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంది. అయితే అనేక దశాబ్దాల నాటి ఈ వివాదానికి ఎలా తెరపడిందో ఓసారి పరిశీలిద్దాం..

ayodhya-babri-maszid-case-full-timeline-from-1528-to-2019-novermber
అయోధ్య వివాదం ఆరంభం నుంచి భూమిపూజ వరకు..
అయోధ్య వివాదం ఆరంభం నుంచి భూమిపూజ వరకు..

ఆది నుంచి అయోధ్య వివాదం అంతా భూ యాజమాన్య హక్కు చుట్టూనే తిరిగింది. బాబ్రీ మసీదు నిర్మించిన 2.77 ఎకరాల భూమి తమదంటే.. తమదంటూ ఇరువర్గాలూ వాదించుకుని కోర్టులకెక్కాయి. అందులోనూ 1500 గజాల భూమే అత్యంత కీలకంగా మారి, వివాదం అంతా దానిపైనే కేంద్రీకృతమైంది. ఓసారి తేదీలతో ఆ వివాదాన్ని పరిశీలిద్దాం...

ఇలా సాగింది...

  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో 1528లో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ సేనాని మీర్‌ బాఖీ ఒక మసీదును నిర్మించారు. బాబర్‌ పేరు మీద ఆ ప్రార్థనా స్థలాన్ని బాబ్రీ మసీదుగా పిలుస్తున్నారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న రామ మందిరాన్ని నేలకూల్చి ఈ మసీదును నిర్మించారని హిందుత్వవాదులు నమ్ముతున్నారు. అది రాముడి జన్మస్థలమని వాదిస్తున్నారు.
  • 1859లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం అక్కడ ఒక కంచెను నిర్మించి, ఆ చోటును రెండు భాగాలుగా చేసింది. ప్రార్థనాస్థలంలోని లోపలి భాగంలో ముస్లింలు, వెలుపలి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసింది.
  • మసీదు వెలుపల నిర్మించిన వేదిక (రామ్‌ ఛబుత్ర)పైన ఒక మండపాన్ని నిర్మించేందుకు అనుమతించాలని 1885లో మహంత్‌ రఘుబీర్‌ దాస్‌ ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ వేయగా, కోర్టు దాన్ని తిరస్కరించింది.
  • 1949లో మసీదు లోపల రాముడి విగ్రహాలు కనిపించాయి. వీటిని హిందూ సంఘాలే పెట్టాయని ముస్లిం సంస్థలు ఆరోపించాయి. రెండు పక్షాలూ కోర్టును ఆశ్రయించాయి. మొత్తమ్మీద 2.77 ఎకరాల భూమిపై వివాదం చెలరేగింది.
  • డిసెంబర్​ 5, 1950న వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్​ పరంహంస్​ రామచంద్ర దాస్​ కోర్టులో పిటిషన్​ వేశారు.
  • జనవరి 16, 1950న రామ్​ లల్లాను పూజించే హక్కులు ఇవ్వాలని గోపాల్​ సింగ్​ విషారథ్ అనే వ్యక్తి ఫైజాబాద్​​ జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు.​
  • డిసెంబర్​ 18, 1961న వివాదాస్పద స్థలంపై సర్వహక్కులు తమకే ఉన్నాయని ఉత్తరప్రదేశ్​లోని సున్నీ వక్ఫ్​ బోర్డు పిటిషన్​ దాఖలు చేసింది.
  • 1989లో బాబ్రీ మసీదు పక్క స్థలంలో రామ మందిర నిర్మాణానికి విశ్వ హిందూ పరిషద్‌ (వీహెచ్‌పీ) శంకుస్థాపన చేసింది. మసీదును వేరే చోటుకు మార్చాలని వీహెచ్‌పీ నేత దేవకీ నందన్‌ అగర్వాల్‌ పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో అయోధ్య స్థల యాజమాన్యంపై అప్పటివరకూ దాఖలైన నాలుగు పిటిషన్లు అలహాబాద్‌ హైకోర్టులోని ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ అయ్యాయి.
  • జులై 1, 1989న భగవాన్​ రామ్​ లల్లా విరాజ్​మాన్​ పేరిట ఐదో పిటిషన్​ దాఖలైంది.
  • 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును 'కరసేవకులు' కూల్చివేశారు.
  • 2002 ఏప్రిల్​లో త్రిసభ్య ధర్మాసనం నేతృత్వంలో వివాదాస్పద స్థలంపై వాదనలు ప్రారంభమయ్యాయి.

కీలక తీర్పు...

అయోధ్య స్థల వివాదంపై దాఖలైన నాలుగు సివిల్‌ దావాలపై అలహాబాద్‌ హైకోర్టు 2010 సెప్టెంబర్​ 30న కీలక తీర్పు వెలువరించింది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు.. సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌ లల్లాలు సమానంగా పంచుకోవాలని స్పష్టంచేసింది.

  • మే 09, 2011న అలహాబాద్​ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ 14 పిటిషన్లు దాఖలు కాగా.. 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం.. కింది కోర్టు తీర్పుపై స్టే విధించింది.
  • మార్చి 21, 2017న ముగ్గురు కక్షిదారులు కోర్టు బయట సమస్య పరిష్కరించుకోవాల్సిందిగా సూచించింది సుప్రీంకోర్టు.
  • డిసెంబర్​ 05, 2017న వచ్చ ఏడాది ఫిబ్రవరి నుంచి సివిల్​ అప్పీళ్లను వినాలని సుప్రీం నిర్ణయించింది. అయోధ్య కేసును భూవివాదంగా చూడాలని అత్యన్నత న్యాయస్థానం కక్షిదారులకు సూచించింది.
  • జనవరి 8, 2019న దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది.
  • మే 09, 2019న ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ఓ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది.
  • ఆగస్టు 6, 2019న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుంచి రోజువారీగా విచారణ సాగించింది. అక్టోబర్​ 16న సుప్రీం బెంచ్​ ఆర్డర్​ను రిజర్వ్​ చేసింది. మొత్తం 40 రోజులపాటు ధర్మాసనం కేసుపై విచారణ చేపట్టింది.

నవంబర్​ 9, 2019: దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్​ బోర్డ్​కు 5 ఎకరాల స్థలాన్ని.. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని ఆదేశించింది సుప్రీం. అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయితో పాటు మరో నలుగురు న్యాయమూర్తుల(జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌) ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

ఆగస్టు 5, 2020న(నేడు) రామ మందిర భూమిపూజ అయోధ్యలో జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.