టూత్ బ్రష్‌ను మింగేసి ఇబ్బంది పడ్డాడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఓ 33 ఏళ్ల వ్యక్తి. ఉదయం ఎప్పటిలాగే పళ్లు తోముకునేటప్పుడు అతడు పొరపాటున బ్రష్‌ను మింగేశాడు. ఆ తర్వాత తీవ్ర కడుపునొప్పితో స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి చేరాడు.
పరీక్షించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు. కళాశాల డీన్ డాక్టర్ కన్నన్ యెకికార్ నేతృత్వంలోని బృదం.. బాధితుడి కడుపులో నుంచి టూత్‌బ్రష్‌ను బయటకు తీసింది.
ఇదీ చూడండి:'వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువకుడి కాలు తొలగింపు'