అసోంలోని సీరంగ్ జిల్లా దబాబిల్ గ్రామం ఆయీ నది పాలైంది. వరద ముంచెత్తి ఊరిని నాశనం చేసింది. పొలాల్లో నీరు, ఇసుక తప్ప ఏమి మిగల్లేదు. ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేసింది. గ్రామస్థులు నిలువ నీడ కోసం వెతుకుతూ వలస బాటపట్టారు.
వాతావరణం సహకరించక రాష్ట్ర విపత్తు స్పందన దళాలు(ఎస్డీఆర్ఎఫ్) ఈ గ్రామానికి చేరుకోలేకపోతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడి ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం అందలేదు.
అసోంవ్యాప్తంగా వరద బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్ల ప్రాణాలు బలిగొన్న వరదలు ఇంకా తగ్గుముఖం పట్టడంలేదు. నదుల్లో నీటి మట్టం పెరిగి తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.
ఇదీ చూడండి:నదిలో దూకి బాలికను కాపాడిన జవాన్లు