ETV Bharat / bharat

ఆసియాలో తొలిసారి కొవిడ్​ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

author img

By

Published : Aug 30, 2020, 2:01 PM IST

ఆసియాలోనే మొట్టమొదటి సారి ఓ కొవిడ్​ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు. దీనికి ముందు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ రోగులపై ఇలాంటి శస్త్ర చికిత్సలు రెండు మాత్రమే విజయవంతమయ్యాయి.

Asia's first bilalteral lung transplantion on a COIVID patient performed in Chennai
అసియాలో మొదటిసారి కొవిడ్​ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

కరోనా మహమ్మారి కారణంగా వైద్య ప్రపంచానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు వైద్య నిపుణులు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ఓ కొవిడ్​ రోగికి ఎంతో క్లిష్టమైన ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఫలితంగా ఆసియాలోనే మొదటిసారి ఈ ఆపరేషన్​ చేసిన వారిగా ఘనత సాధించారు. దీనితో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ముగ్గురు కొవిడ్​ రోగులకు మాత్రమే ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది.

ఈ శస్త్ర చికిత్సకు ఎంజీఎం ఆస్పత్రి ఛైర్మన్​, హార్ట్​ అండ్​ లంగ్​ ట్రాన్స్​ప్లాంట్​ డైరెక్టర్​ డా.కేఆర్ బాలక్రిష్ణన్​ నేతృత్వం వహించారు. ఆయన ప్రత్యేక వైద్య నిపుణుల బృందంలో డా.సురేశ్ రావు, డా.శ్రీనాథ్​, డా.అపర్​ జిందాల్ ఉన్నారు.

దిల్లీ నుంచి..

ఈ శస్త్ర జరిగిన 48 ఏళ్ల వ్యక్తి దిల్లీకి చెందినవాడు. జున్​ 8న కరోనా బారినపడ్డాడు. వైరస్ కారణంగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొంత భాగం మాత్రమే పనిచేస్తోంది. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది తలెత్తిన తర్వత జూన్ 20నుంచి అతన్ని వెంటిలేటర్​పై ఉంచారు. పరిస్థితి విషమించగా జులై 20న ఘాజియాబాద్​ నుంచి విమానంలో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి విమానం ద్వారా తరలించారు. జులై 25 నుంచి అతన్ని ఎక్మోపై ఉంచారు.

మొదట శస్త్రచికిత్సపై సందిగ్ధంలో ఉన్నామని, రోగి ప్రాణాలు కాపాడేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆగస్టు 27న ఊపిరితిత్తుల మార్పిడి నిర్వహించామని డా.బాలక్రిష్ణన్ తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎక్మో మద్దతు అవసరం లేదని చెప్పారు.

ఇదీ చూడండి: కరోనా వార్డులో మరుగుదొడ్లు కడిగిన ఆరోగ్య మంత్రి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.