ETV Bharat / bharat

మారుమూల గ్రామ పర్యటన కోసం 24కి.మీ నడిచిన సీఎం - అరుణాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి

అరుణాచల్​ప్రదేశ్ సీఎం​ పెమాఖండూ.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలను కలిసేందుకు సుమారు 24 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆయన.. 11 గంటలపాటు నడిచి ఓ చిన్న గ్రామంలోని ప్రజలను కలిశారు.

Arunachal CM treks for 11 hours to meet people of remote village
మారుమూల గ్రామ పర్యటన కోసం 24కి.మీ నడచిన సీఎం
author img

By

Published : Sep 11, 2020, 8:49 PM IST

అరుణాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి పెమాఖండూ తన సొంత నియోజకవర్గ పర్యటన సందర్భంగా సుమారు 24 కిలోమీటర్ల దూరం కాలినడక సాగించారు. తవాంగ్​ జిల్లాలోని ముక్తోలో మారుమూల గ్రామ ప్రజలను కలుస్తూ సుమారు 11 గంటలు నడిచారు. తవాంగ్​లో నడక ప్రారంభించిన సీఎం.. పర్వత ప్రాంతం నుంచి సుమారు 97 కిలోమీటర్లు ప్రయాణించి లుగుతాంగ్​ గ్రామానికి చేరుకున్నారు.

సముద్ర మట్టానికి సుమారు 14,500 అడుగుల ఎత్తులో ఉన్న లుగుతాంగ్​లో కేవలం పది ఇళ్లు ఉంటాయి. 50 మంది నివాసం ఉంటారు. ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆ గ్రామానికి సీఎం కాలినడకన వెళ్లి సమీక్షించడం విశేషం. ఖండూతో పాటు తవాంగ్​ ఎమ్మెల్యే షం రింగ్​ తాషి కూడా ఉన్నారు.

ఇదీ చదవండి:కరోనా అనంతరం తలెత్తే సమస్యలపై 'ఫోన్​ సర్వే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.