ETV Bharat / bharat

ఇక ఉచితంగా 'ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్' పాఠాలు!

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా? కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఉచితంగా ఆ అవకాశాన్ని అందిస్తోంది. మూక్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా యూజీసీ దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థులతోపాటు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఈ 15 వారాల కోర్సులో చేరవచ్చు.

Artificial Intelligence  Learn for free!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. నేర్చుకోండి ఉచితంగా!
author img

By

Published : May 14, 2020, 11:05 AM IST

కృత్రిమ మేధ (ఏఐ)​ వినియోగం అన్ని రంగాల్లోనూ విస్తృతమవుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. వీరిలో విద్యార్థులతోపాటు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఉన్నారు. వీరందరికీ సాయపడేలా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కోర్సును అందిస్తోంది. ఆన్‌లైన్‌లో ఉచితంగా నిర్వహిస్తున్నారు. దీనిని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లుగా చెబుతున్నప్పటికీ, ఆసక్తి ఉన్నవారెవరైనా చేరగలిగే వీలు కల్పించారు.

15 వారాల కోర్సు

కోర్సును యూజీసీ మూక్స్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇది ఎంహెచ్‌ఆర్‌డీ స్వయంకు సంబంధించిందే. కోర్సు వ్యవధి 15 వారాలు. 36 లెర్నింగ్‌ మాడ్యూళ్లు ఇందులో ఉన్నాయి. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా వివరిస్తూ రూపొందించారు. ప్రతి మాడ్యూల్‌ ఈ-టెక్స్ట్‌, సెల్ఫ్‌ లర్నింగ్‌ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ-టెక్స్ట్‌ పీడీఎఫ్‌ల రూపంలో ఉంటుంది. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పించారు. సెల్ఫ్‌ లెర్నింగ్‌లో వీడియోలు అందుబాటులో ఉంటాయి.

ఇక్కడ చూడండి..

ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్‌లో సైన్‌అప్‌ అయ్యి జాయిన్‌ కావచ్చు. కోరుకున్నది నేర్చుకోవచ్చు. వివరాలకు

http://ugcmoocs.inflibnet.ac.in/ugcmoocs/

http://ugcmoocs.inflibnet.ac.in/ugcmoocs/view_module_ug.php ను సందర్శించవచ్చు.

ఏయే మాడ్యూళ్లు..?

ఏఐ అంటే ఏమిటి? ఏఐ టెక్నిక్స్‌, ఏ సమస్యలకు ఏఐ అవసరం?; స్టేట్‌ స్పేస్‌ సెర్చ్‌ 1 అండ్‌ 2; అన్‌గైడెడ్‌ సెర్చ్‌ మెథడ్స్‌; హ్యురిస్టిక్‌ అండ్‌ అదర్‌ సెర్చ్‌ మెథడ్స్‌; ప్రాబ్లమ్స్‌ విత్‌ సెర్చ్‌ మెథడ్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌; జెనెటిక్‌ అల్గారిథమ్‌ అండ్‌ ట్రావెలింగ్‌ సేల్స్‌మన్‌ ప్రాబ్లమ్‌; ఆంట్‌ కాలనీ ఆప్టిమైజేషన్‌, బ్రాంచ్‌ అండ్‌ బౌండ్‌, రిఫైన్‌మెంట్‌ సెర్చ్‌; యూజింగ్‌ ఫజ్జీ లాజిక్‌; ఫ్రేమ్స్‌ అండ్‌ సెమాంటిక్‌ నెఫ్టార్‌ నాలెడ్జ్‌ రెప్రజెంటేషన్‌; మెషిన్‌ లర్నింగ్‌ మొదలైన మాడ్యూళ్లు ఉన్నాయి.

ఇదీ చూడండి: ఇది విన్నారా..? వైరస్‌ను 'ఢీ' కొట్టే విటమిన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.