కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాజ్యం కూడా ఉంది.
జాతీయ భద్రతకు సంబంధించి జమ్ముకశ్మీర్‌లో సమస్యలు ఉన్నప్పటికీ.. 70లక్షల మందిపై ఆంక్షలు విధించడం సరికాదని ఆజాద్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ అత్యున్నత న్యాయస్థానంలో వాదించారు.
అప్పటి జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం లోయలో ఆంక్షలు విధించడాన్ని అక్కడి అధికార యంత్రాంగం సమర్థించింది. పాకిస్థాన్ సైన్యం, వేర్పాటువాదులు, ఉగ్రవాదులు.. జిహాద్ పేరుతో అలజడి సృష్టించడానికి ప్రయత్నించడం వల్లే కశ్మీర్లో అంతర్జాల సేవలను నిలిపివేసినట్టు వాదించింది. ఆంక్షల వల్లే ఒక్క ప్రాణం కూడా పోలేదని.. ఒక్క బులెట్‌ను కూడా ఉపయోగించలేదని తెలిపింది.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.
ఇదీ చూడండి:- ప్రత్యర్థుల 'మహా మైత్రి'పై అజిత్ ఇలా... దేవేంద్ర అలా...