అజ్ఞానం కంటే అహంకారం ఎంతో ప్రమాదకరమని, ప్రస్తుత లాక్‌డౌన్ అదే విషయాన్ని నిరూపించిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కొద్ది రోజులుగా కరోనా నియంత్రణలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తున్న ఆయన తాజాగా మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటలను ఉదహరించారు. 'అజ్ఞానం కంటే అహంకారం ఎంతో ప్రమాదకరం, ఈ లాక్‌డౌన్ దానినే నిరూపించింది' అని ట్విటర్లో విమర్శిస్తూ ఒక గ్రాఫ్‌ను షేర్ చేశారు. మార్చి నుంచి దేశవ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాలు, ఆర్థిక పరిస్థితి దిగజారిన తీరును ఈ గ్రాఫ్ సూచిస్తుంది. గణాంకాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు తెలిపారు.
-
This lock down proves that:
— Rahul Gandhi (@RahulGandhi) June 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
“The only thing more dangerous than ignorance is arrogance.”
Albert Einstein pic.twitter.com/XkykIxsYKI
">This lock down proves that:
— Rahul Gandhi (@RahulGandhi) June 15, 2020
“The only thing more dangerous than ignorance is arrogance.”
Albert Einstein pic.twitter.com/XkykIxsYKIThis lock down proves that:
— Rahul Gandhi (@RahulGandhi) June 15, 2020
“The only thing more dangerous than ignorance is arrogance.”
Albert Einstein pic.twitter.com/XkykIxsYKI
కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని కొంత కాలంగా రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభంలో దేశ ఆర్థిక పరిస్థితిపై రాహుల్ పలువురు మేధావులు, విధాన రూపకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ, పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పలువురు నిపుణులతో మాట్లాడారు. అలానే భారత్-చైనా మధ్య లద్దాఖ్ సరిహద్దు వివాదంపై కూడా రాహుల్ కేంద్రంపై విమర్శలు చేశారు. సరిహద్దులో ఏం జరుగుతుందో ప్రజలకు తెలపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అయితే దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలను సామాజిక మాధ్యమాలలో చర్చించకూడదని కేంద్ర మంత్రులు రాహుల్‌కు హితవు పలికారు. సరైన సమయంలో పార్లమెంటులో అన్ని విషయాలను వెల్లడిస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.