గల్వాన్ లోయలో గాయపడిన జవాన్లకు లేహ్ ఆస్పత్రిలో అందిస్తున్న సదుపాయాలపై.. పలు వర్గాలు చేసిన విమర్శలకు సమాధానమిచ్చింది భారత సైన్యం. జవాన్లకు చికిత్స చేస్తున్న ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవనడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
"మన జవాన్ల చికిత్సకు సంబంధించిన సదుపాయాలపై విమర్శలు రావడం దురదృష్టకరం. రక్షణ విభాగం తన ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలనే కల్పిస్తుంది. ప్రధాని మోదీ సందర్శన నేపథ్యంలో సరైన వసతులు లేవనడం సరికాదు. ఆరోపణలకు కారణమైన భవనం కరోనా మహమ్మారి కోసం సిద్ధం చేసింది. ఇందులో ఎక్కువ భాగం జనరల్ ఆస్పత్రి కోసం వినియోగిస్తున్నారు. శిక్షణ తరగతుల కోసం ఉపయోగించే ఈ హాల్‌ను కొవిడ్-19 ట్రీట్మెంట్ కోసం 100 పడకలతో సన్నద్ధం చేశారు."
-సైన్యం ప్రకటన.
శుక్రవారం కశ్మీర్ లేహ్‌లో ఆకస్మికంగా పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. గల్వాన్ ఘటన క్షతగాత్రులతో మాట్లాడారు. అయితే ఓ విభాగంలోని సదుపాయాలను పేర్కొంటూ సైనికులకు సరైన చికిత్స అందడం లేదని ఆరోపణలు వచ్చాయి. వీటిపైనే వివరణ ఇచ్చింది సైన్యం.
ఇదీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జూ పార్క్ విశేషాలివే