ETV Bharat / bharat

రాజధానిలో ఆగని నిరసనలు.. జఫ్రాబాద్​లో ఉద్రిక్తత - దిల్లీ పౌర నిరసనలు

దేశ రాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి నుంచి జఫ్రాబాద్​ వద్ద మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జఫ్రాబాద్​ మెట్రోస్టేషన్​ గేట్లను మూసివేసిన అధికారులు.. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.

anti-caa-protest-continues-at-delhis-jaffrabad
రాజధానిలో ఆగని నిరసనలు.. జఫ్రాబాద్​లో ఉద్రిక్తత
author img

By

Published : Feb 23, 2020, 11:46 AM IST

Updated : Mar 2, 2020, 7:00 AM IST

రాజధానిలో ఆగని నిరసనలు.. జఫ్రాబాద్​లో ఉద్రిక్తత

పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలతో దిల్లీలో మరోమారు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జఫ్రాబాద్​లో శనివారం రాత్రి ప్రారంభమైన పౌర ఆందోళనలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జఫ్రాబాద్​ మెట్రో స్టేషన్​ వద్ద భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ముందు జాగ్రత్తగా మెట్రో స్టేషన్​ గేట్లను ముసివేశారు.

సీఏఏకు వ్యతిరేకంగా శనివారం రాత్రి మహిళలు భారీ సంఖ్యలో జఫ్రాబాద్​కు చేరుకున్నారు. ఫలితంగా సీలంపుర్ రోడ్డు(మౌజ్​పుర్-యమునా విహార్​ను కలిపే రహదారి​)లో రాకపోకలు నిలిచిపోయాయి. త్రివర్ణ పతాకాలను పట్టుకుని 'ఆజాదీ' నినాదాలు చేశారు. సీఏఏను రద్దు చేసేంతవరకు అక్కడి నుంచి కదలమని స్పష్టం చేశారు.

సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే దిల్లీలోని షహీన్​బాగ్​, ప్రధాన శీలంపుర్​ రోడ్డులో నిరసనలు జరుగుతున్నాయి.

Last Updated : Mar 2, 2020, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.