మహారాష్ట్రలో రెండో రోజూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ భారీ వర్షం ధాటికి మరోల్ ప్రాంతంలోని అంధేరీ హౌసింగ్ సొసైటీ వద్ద గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న కార్లు ధ్వంసం అయ్యాయి.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదర్, గోవంది వద్ద గోడలు కూలి... ఐదుగురు క్షతగాత్రులయ్యారు. నగరంలోని పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 39 చోట్ల షార్ట్‌సర్క్యూట్, 104 చోట్ల చెట్లు నేలకొరిగినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: కన్న బిడ్డ కోసం.... విధ్వంసం సృష్టించారు