దేశంలో హత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో తాజాగా ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం చేశాడో దుండగుడు. అనంతరం గొంతు కోసి.. ఓ బావిలో పడేశాడు.
గత శుక్రవారం తన తల్లి చెంత నిద్రిస్తున్న బాలికను ఓ గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఆ తర్వాత ఆ మైనర్‌పై హత్యాచారం చేసి సమీపంలోని నీరులేని బావిలో విసిరేశాడు. అయితే.. బాలిక కనిపించడం లేదన్న కుటుంబీకుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం రాత్రి చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.
ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.
ఇదీ చదవండి: ఉత్తర్‌ప్రదేశ్‌లో జర్నలిస్ట్ సజీవదహనం