పౌరసత్వ సవరణ చట్టం చుట్టూ నెలకొన్న గందరగోళంపై స్పష్టతనిచ్చేందుకు నేడు బంగాల్లో పర్యటించనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. కోల్‌కతాలోని షాహీద్ మినార్ మైదానంలో సీఏఏపై జరిగే సభలో ఆయన పాల్గొననున్నారు. పౌర చట్టంపై సందేహాలను నివృత్తి చేయనున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి.
''తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పౌర చట్టంపై ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించింది. అమిత్ షా.. ఆ అంశంపై స్పష్టతనిస్తారు. టీఎంసీ నేతలకు షా సరైన సమాధానమిస్తారు.''
- బంగాల్ భాజపా సీనియర్ నేత
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సభకు హాజరుకానున్నారు. పౌర చట్ట రూపకల్పన, ఆమోదంలో కీలకంగా వ్యవహరించిన అమిత్ షాను ఈ సందర్భంగా సన్మానించనున్నారు భాజపా నేతలు.
కాళీ ఘాట్‌కు షా...
కోల్‌కతాలోని రాజార్‌హాట్‌లో నిర్మించిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) నూతన భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. త్వరలో కోల్‌కతా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... భాజపా బంగాల్ విభాగంతో షా, నడ్డా అంతర్గత చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా.. కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీ ఘాట్‌ను కూడా షా సందర్శిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి.