కొవిడ్‌ను నిర్ధరించే ఆర్టీ- పీసీఆర్ పరీక్షల కోసం 4 వేల 500 రూపాయలకు మించి చెల్లించవద్దన్న నిబంధనను భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్) తొలగించింది. ఈ మేరకు ప్రైవేటు ల్యాబ్‌లతో చర్చించి పరస్పర అంగీకారంతో ఓ ధరను నిర్ణయించుకోవాలని.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు లేఖ రాసింది.
కరోనా టెస్టింగ్ కిట్లు దేశీయంగా సంతృప్తికర స్థాయిలో ఉత్పత్తి అవుతున్న దృష్ట్యా ప్రైవేట్ ల్యాబ్‌లతో చర్చించి పరస్పరం అంగీకరించే విధంగా ధరలను నిర్ణయించుకోవచ్చని లేఖలో తెలిపింది. మార్చిలో టెస్టింగ్ కిట్ల కొరత వల్ల ఆర్టీ- పీసీఆర్ పరీక్షల ధరలను నియంత్రించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కిట్లు విరివిగా లభిస్తున్నాయన్న ఐసీఎంఆర్.. కొవిడ్ నిర్ధరణ పరీక్షల ధరలను నిర్ణయించుకోవచ్చని రాష్ట్రాలకు తెలిపింది.