ETV Bharat / bharat

అయోధ్య: పంచతంత్రం.. దేశాన్ని మెప్పించింది! - అయోధ్య తీర్పు

సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘ విచారణ జరిగిన రెండో కేసు అయోధ్య భూవివాదం. ఐదుగురు న్యాయమూర్తులున్న రాజ్యాంగ ధర్మాసనం ఎంతో ఓపిగ్గా దేశం మెచ్చుకునే తీర్పును ప్రకటించింది. ఇంతకీ ఆ ధర్మాసనంలో ఉన్నవారెవరు.. వారి నేపథ్యమేమిటి?

పంచతంత్రం.. దేశాన్ని మెప్పించింది
author img

By

Published : Nov 10, 2019, 9:06 AM IST

దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య స్థల వివాదం ఎట్టకేలకు ముగిసింది. దీనిపై 2019 జనవరి 8న సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఆగస్టు నుంచి అక్టోబరు వరకు 40 రోజులపాటు ధర్మాసనం కేసుపై విచారణ చేపట్టింది.

ఈ కీలక తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనంలోని సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయితో పాటు మరో నలుగురు న్యాయమూర్తుల నేపథ్యమిదీ..

జస్టిస్‌ రంజన్‌ గొగొయి

సుప్రీంకోర్టు మనుగడలోకి రాకముందు నుంచే నానుతున్న అయోధ్య వివాదాన్ని పరిష్కరించిన ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

  • ముక్కుసూటి మనిషి

ముక్కుసూటి మనిషిగా పేరుతెచ్చుకున్న జస్టిస్​ గొగొయి ఈశాన్యం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి వ్యక్తి. అస్సాం హైకోర్టు జడ్జిగా, పంజాబ్‌, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

  • ఆరోపణలకు క్లీన్​ చీట్

సుప్రీంకోర్టులో ప్రవేశించాక ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనా ఆయన తన సహజశైలితో ముందుకుపోయారు. సుప్రీంలోని మహిళా సిబ్బంది నుంచి ఎదురైన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో అంతర్గత కమిటీ నుంచి క్లీన్‌చిట్‌ పొందారు. 2018 జనవరిలో జస్టిస్​ గొగొయితోపాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌మిశ్రాపై నిరసన గళమెత్తారు.

  • పదవి విరమణలోపు..

తమకు కేటాయిస్తున్న కేసుల తీరు సరిగా లేదని జస్టిస్​ గొగొయి అప్పట్లో ఆక్షేపించారు. ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గొగొయి.. శబరిమల, రఫేల్‌పై రివ్యూ పిటిషన్‌ తదితర కీలక కేసులపై తీర్పులు వెలువరించనున్నారు. ఆయన తండ్రి కేసబ్‌ చంద్ర గొగొయి 1982లో 2 నెలలపాటు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు.

జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌

1979లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2001లో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో కేరళ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన అనంతరం అక్కడే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దిల్లీకి ప్రత్యేక హోదా, ఆధార్‌ చట్టం తదితర కీలక కేసుల విచారణలో భాగస్వామిగా ఉన్నారు.

జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే

జస్టిస్‌ గొగొయి పదవీ విరమణ అనంతరం సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్​డే. బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. మహారాష్ట్రకు చెందిన బోబ్​డే ఏప్రిల్‌ 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ఆయన 18 నెలలపాటు సుప్రీంకోర్టు సీజేఐగా సేవలు అందించనున్నారు. అయోధ్య తీర్పుతోపాటు ఆధార్‌ ఆర్డినెన్స్‌, వ్యక్తిగత గోప్యత హక్కు, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు, అధికరణ 370 కేసుల విచారణలో ఈయన భాగస్వామి. అయోధ్య కేసులో హిందూ, ముస్లిం వర్గాల తరఫున హాజరైన న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించడంలో కీలకంగా వ్యవహరించారు.

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌. 2016 మే 13న డీవై చంద్రచూడ్‌ సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అతిఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ తనయుడే డీవై చంద్రచూడ్‌.
సుప్రీంకోర్టుకు రాకముందు డీవై చంద్రచూడ్‌ బాంబే హైకోర్టు జడ్జిగా, అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కాలంచెల్లిన పలు చట్టాలను తోసిపుచ్చిన సుప్రీం న్యాయమూర్తిగా పేరుతెచ్చుకున్నారు.

వ్యక్తిగత గోప్యత, సహజీవనంపై తన తండ్రి ఇచ్చిన తీర్పులపై విరుద్ధ అభిప్రాయం వ్యక్తంచేస్తూ తీర్పులిచ్చారు. తన మూడున్నరేళ్ల సర్వీసులో శబరిమల, ఆధార్‌, వ్యక్తిగత గోప్యత, సహజీవనం తదితర కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అతిథి ఆచార్యుడిగానూ పనిచేశారు.

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

కర్ణాటక హైకోర్టులో 20 ఏళ్లపాటు న్యాయవాదిగా సేవలందించిన జస్టిస్‌ నజీర్‌.. అదే కోర్టులో 2003లో అదనపు న్యాయమూర్తిగా, ఆ తర్వాత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని ప్రకటించిన సుప్రీం ధర్మాసనంలో ఈయన సభ్యుడు. అయోధ్య కేసు ధర్మాసనంలో ఏకైక ముస్లిం న్యాయమూర్తి అయిన నజీర్‌ మతపరమైన ఇతర కేసుల విచారణలో భాగస్వామిగా ఉన్నారు. ముమ్మారు తలాక్‌పై విచారణలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడైన ఆయన మైనార్టీ తీర్పునిచ్చారు. అయోధ్య విషయంలో మాత్రం ముస్లిం పార్టీల వాదనలను తోసిపుచ్చుతూ ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తులతో గళం కలిపారు.

తీర్పు ఏ న్యాయమూర్తి రాశారు?

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన 1045 పేజీల తీర్పును ఏ న్యాయమూర్తి రాశారన్నది బయటికి వెల్లడించలేదు. ధర్మాసనంలో ఎంతమంది న్యాయమూర్తులున్నా తీర్పును అందులో ఎవరో ఒకరే రాస్తారు.
దాంతో ఏకీభవించే న్యాయమూర్తులు సంతకాలు చేస్తారు. భిన్నాభిప్రాయాలు ఉన్న న్యాయమూర్తులు ప్రత్యేక తీర్పునివ్వడం ఆనవాయితీ. తాజా తీర్పును అయిదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో వెల్లడించినప్పటికీ దాన్ని ఎవరు రాశారన్న విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా తీర్పు ప్రతిలో పొందుపరచలేదు.

తీర్పు చివరిలో మాత్రం కేసు విచారించిన ప్రధాన న్యాయమూర్తితో పాటు, మిగిలిన నలుగురు న్యాయమూర్తుల పేర్లు ఉన్నాయి.

ఏకాభిప్రాయంలోనూ కాస్త అసమ్మతి

అయిదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చినప్పటికీ ఇందులోనూ కాస్త అసమ్మతి ఉంది. ఒక న్యాయమూర్తి మాత్రం ఆ స్థలం రామజన్మభూమే అని స్పష్టంగా చెబుతూ తీర్పు చెప్పారు.

ఏకాభిప్రాయానికి కాస్త విరుద్ధంగా ఉండడంతో దీన్ని కూడా అసమ్మతి తీర్పుగానే పరిగణిస్తారు. అయితే ఆ న్యాయమూర్తి పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఈ విషయమై ఆయన రాసిన 116 పేజీల తీర్పును ‘అనుబంధం’గా పొందుపరిచారు. కేసుకు ఉన్న సున్నితత్వం దృష్ట్యా పేర్లు వెల్లడించలేదని భావిస్తున్నారు.

ఆధార్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన అయోధ్య కేసు

అయోధ్య కేసు... సుప్రీంకోర్టు చరిత్రలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది. సర్వోన్నత న్యాయస్థానంలో అత్యంత సుదీర్ఘ కాలం విచారణ జరిగిన రెండో కేసుగా 2.77 ఎకరాల అయోధ్య భూవివాదం నిలిచింది.

1972లో ‘కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ ప్రభుత్వం’ కేసు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ కేసుపై అప్పట్లో 68 రోజుల పాటు విచారణ సాగింది. ఆ తర్వాతి స్థానంలో 38 రోజుల పాటు సాగిన ఆధార్‌ కేసు ఉండేది. అయితే అయోధ్య భూ వివాదం కేసు.. ఆధార్‌ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి అక్టోబరు 16 వరకు 40 రోజుల పాటు విచారణ కొనసాగింది.

అనూహ్యంగా ‘ఆ ఇద్దరికి’ అవకాశం!

చరిత్రాత్మక అయోధ్య స్థల వివాద తీర్పులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌లు అనూహ్యంగా భాగస్వాములయ్యారు.

వాస్తవానికి సీనియర్‌ న్యాయమూర్తులుగా అయోధ్య అంశంపై రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ యూయూ లలిత్‌లు సభ్యులుగా ఉండాలి. కానీ, వాళ్లిద్దరూ వైదొలిగిన కారణంగా తదుపరి సీనియారిటీ ప్రాతిపదికన వారికి అవకాశం వచ్చింది.

ఇదీ చూడండి:పట్టాలపై పహారా కాస్తున్న ముంబయి 'యముడు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
São Paulo, 9 November 2019
1. Wide of crowd chanting: (Portuguese) "Ole Ole Ola, Lula, Lula"
2. Mid of supporters of former Brazilian President Luiz Inácio Lula da Silva carrying a Brazilian flag
3. Mid of supporters waving a puppet of Lula
4. Wide of giant puppet of Lula
5. Lula walking through crowd and getting into a truck
6. Wide of supporters listening to Lula
7. Close of man with tears in his eyes listening to Lula
8. SOUNDBITE (Portuguese) Luiz Inácio Lula da Silva, former Brazilian President:
"Will Lula want revenge? I don't want anything. I want to build this country with the same happiness we built it when we were governing the country."
9. Mid of supporter holding a mask of Lula and crowd chanting: (Portuguese) "Ole Ole Ola, Lula, Lula"
10. Crowd chanting: (Portuguese) "Lula, warrior of the Brazilian people"
11. SOUNDBITE (Portuguese) Vera Lucia Zais, supporter of former Brazilian President Luiz Inácio Lula da Silva:
"(Lula) representing the whole dream of the Brazilian people. Not only mine, not only my family's, but of millions of families in Brazil."
12. Close of man wearing a ribbon on his head reading: (Portuguese) "Lula innocent"
13. Wide of crowd
14. SOUNDBITE (Portuguese) Pedro de Oliveira, supporter of former Brazilian President Luiz Inácio Lula da Silva:
"We came here to receive Lula, thank him for everything he's done for us, we're very happy to celebrate Lula returning to the people. Not the way we want, which is the annulment of his unfair trial, a stolen and corrupt trial from judge Serio Moro. We're here to celebrate this small victory we've had."
15. Various of former president Lula being carried on the shoulders of the supporters
STORYLINE:
Thousands gathered outside the Metal Workers Union in São Paulo on Saturday to listen to former Brazilian President Luiz Inácio Lula da Silva, who was released from the prison in Curitiba the previous day.
"We came here to receive Lula, thank him for everything he's done for us" said Pedro de Oliveira, who like many other supporters was wearing a red t-shirt reading "Lula Free".
The followers of the former Brazilian leader, universally known as Lula, cried with joy and celebrated the release of their leader who spent 580 days in prison.
"(Lula) is representing the whole dream of the Brazilian people. Not only mine, not only my family's, but of millions of families in Brazil" said Vera Lucia Zais who attended the rally.
Da Silva told thousands of jubilant supporters on Saturday that the left can take back the presidency in the 2022 election.
Dressed in a black blazer and t-shirt, da Silva spoke from a stage outside the union he once led and that served as the base for his political career.
The crowd of red-clad supporters cheered and waved flags during his 45-minute speech.
He spoke briefly of conservative President Jair Bolsonaro, who won the 2018 election after da Silva's conviction barred him from running.
Da Silva said Brazilians must accept the results of the democratic election and work to defeat the "ultra-right" in 2022.
He also called for solidarity with fellow South American countries and lambasted US President Donald Trump, saying his border wall plan is unacceptable and aimed at keeping out poor people.
Brazil's Supreme Court on Thursday ruled that a person can be jailed only after all appeals to higher courts have been exhausted.
Da Silva was released the next day, after 19 months imprisonment.
He is still appealing his conviction related to the alleged purchase of a beach front apartment and remains entangled in other cases.
He was also convicted by a lower court judge in a case centered around ownership of a farmhouse in Atibaia, outside São Paulo.
If he loses his appeals in either conviction, he could be locked up once again.
Da Silva has denied any wrongdoing and accused prosecutors and Sergio Moro, then a judge and now justice minister, of manipulating the case against him.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.