ETV Bharat / bharat

గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్​​ - సీఎస్ఐఆర్​

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినట్లు.. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించేందుకు అవకాశముందని సీఎస్ఐఆర్ వెల్లడించింది. అందువల్ల బహిరంగ ప్రదేశాలతో పాటు మూసి ఉన్న ప్రాంతాల్లోనూ మాస్కులు ధరించాలని, కరోనా నివారణ నిబంధనలు పాటించాలని సూచించింది.

Airborne transmission of COVID-19 'distinct possibility': CSIR
గాలి ద్వారా కరోనా వ్యాప్తికి 'అవకాశం' ఉంది: ఐసీఎంఆర్​
author img

By

Published : Jul 21, 2020, 7:48 PM IST

గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశముందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్​ఐఆర్​) స్పష్టం చేసింది. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా.. కార్యాలయాలు వంటి మూసి ఉన్న ప్రాంతాల్లోనూ మాస్కులు ధరించాలని సూచించింది.

"పలు అధ్యయనాలు, ఆధారాలు, వాదనలు ప్రకారం.... కరోనా వైరస్గా లి ద్వారా వ్యాపించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది."

- శేఖర్ సి.మండే, సీఎస్​ఐఆర్ చీఫ్​

డబ్లూహెచ్​ఓ హెచ్చరిక

గాలి ద్వారా కొవిడ్-19 వైరస్ వ్యాపించే అవకాశముందని... ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. దీనిపై తాజాగా సీఎస్​ఐఆర్ స్పందించి.. కీలక వివరాలు వెల్లడించింది.

కరోనా నిబంధనలు పాటించండి

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం ఉన్నందున... ప్రజలు ఒక్క చోట గుమిగూడవద్దని శేఖర్​ మండే సూచించారు. అలాగే పని ప్రదేశాల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, కచ్చితంగా మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు.

Airborne transmission of COVID-19 'distinct possibility': CSIR
కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు ధరించడం తప్పనిసరి

"కరోనా రోగులు దగ్గినా, తుమ్మినా... పెద్ద తుంపర్లు ఉపరితలం మీద పడితే.. చిన్న తుంపర్లు మాత్రం ఎక్కువ సేపు గాల్లోనే ఉండిపోతాయి. సూర్యరశ్మి వల్ల వైరస్ క్రియా రహితం అవుతుందని కొన్ని ఆధారాలు నిరూపిస్తున్నాయి. అయితే మూసి ఉన్న ప్రదేశాల్లో ఈ తుంపర్ల వల్ల వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది."

- శేఖర్ సి.మండే, సీఎస్​ఐఆర్ చీఫ్​

ఇదీ చూడండి: కరోనా వ్యాప్తి, మరణాల రేటు భారత్​లోనే తక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.