జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌లో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. సరిహద్దుల మీదగా దేశంలోకి అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు వంటివి చేరవేసేందుకు చిన్న చిన్న డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
సరిహద్దుల మీదగా 1000 అడుగులు ఎత్తులోపు ఎగిరే డ్రోన్లను కూల్చివేసేందుకు అనుమతులు జారీ చేసింది సైన్యం.
వెయ్యి అడుగులపైన..
ఒక వేళ వెయ్యి అడుగులపైన డ్రోన్లు ఎగురుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆపైన వెళ్లే విమానాలను కూల్చివేసే ప్రమాదం ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
పంజాబ్‌లో కలకలం...
పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల చిన్న డ్రోన్లు దేశంలోకి ప్రవేశించినట్లు సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. గత సోమవారం రాత్రి పంజాబ్ ఫిరోజ్‌పుర్‌లోని భారత్-పాక్ సరిహద్దులో ఓ డ్రోన్ దేశంలోకి చొరబడినట్లు బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. దీనిపై భద్రతా సిబ్బంది సహా స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం- 10 మంది మృతి